‘హనుమాన్’ పాన్ వరల్డ్ రిలీజ్.. ప్లాన్ రివీల్ చేసిన డైరెక్టర్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ( Teja Sajja ) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ''హను-మాన్''.

ఈ సినిమా కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది.

అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూసారు.

అయితే ఈ సినిమా మరింత ఆలస్యం అవ్వబోతుంది.మేకర్స్ ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో ప్రేక్షకులు కొద్దిగా నిరాశ చెందారు.

ఈ సినిమా ముందు నుండి అనుకున్న విధంగా జరిగి ఉంటే ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది.

"""/" / కానీ మేకర్స్ ఈ సినిమాకు ఉన్న అంచనాల దృష్ట్యా వీఎఫ్ఎక్స్ విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని రిలీజ్ వాయిదా వేశారు.

అందుకే ఈ సినిమాను మరికొద్ది రోజులు వాయిదా వేశారు.డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

"""/" / మరి తాజాగా ఈ సినిమా ఎందుకు పాన్ వరల్డ్ రిలీజ్( Pan World Release ) చేయబోతున్నారో తెలిపాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు నిర్మాత నిరంజన్ రెడ్డి గారు ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ కావాలని కోరారు.

అందుకే హిందీ సహా ఇతర భాషల్లో ముందుగా ఈ సినిమాను ప్లాన్ చేశామని.

కానీ ఈ సినిమా యూనివర్శల్ సబ్జెక్ట్ కావడంతో పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు.

మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

డైరెక్టర్ అనుదీప్ కెవి చెప్పిన కథను వెంకటేష్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?