బీస్ట్ అలాగే ఉంటుంది కానీ కాపీ కాదు.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

దర్శకుడు నెల్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కోలమావు కోకిల సినిమాతో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు నెల్సన్.

సినిమా సినిమాకు తన ప్రత్యేకతను చాటుతూ ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాడు.ఇకపోతే నెల్సన్ తాజాగా తెరకెక్కించిన చిత్రం బీస్ట్.

ఈ సినిమాలో విజయ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా నుంచి ఇటీవలె విడుదలైన అరబిక్ కుత్తు అనే పాట ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవడమే కాకుండా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా ఈనెల 14వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.

విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.ఈ సందర్భంగా దర్శకుడు నెల్సన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హీరో విజయ్ తో సినిమాను తెరకెక్కించాలని తాను ఎప్పటినుంచో అనుకుంటున్నానని, అది తన కోరిక అని, ఆయన తన అభిమానులను సంతృప్తి పరచాలని నిర్ణయించుకుకొని రాసుకొన్న కథే బీస్ట్ సినిమా అని చెప్పుకొచ్చారు నెల్సన్.

ఈ సినిమా విజయ్ నటించిన రోటీన్ సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుంది అని తెలిపారు.

"""/"/ అంతేకాకుండా విజయ్ సినిమా అంటే నాలుగైదు పాటలు, అలాగే మారే కాస్ట్యూమ్స్ ఏవేవో ఉంటాయి.

కానీ ఈ సినిమాలో ఆ విధంగా ఉండవు అని తెలిపారు నెల్సన్.మొదట ఈ కథని విజయ్ కి నమ్మకంతో వినిపించాను.

ఇందులో విజయ్ మిలిటరీ రా అధికారిగా విజయ్ కనిపించబోతున్నారు.అయితే స్మగ్లింగ్ తరహా సినిమాలను ఎంచుకుంటున్నారు అని అందరూ ప్రశ్నిస్తున్నారు.

కానీ పనిగట్టుకొని అలాంటి కథలే ఎంచుకోవడం లేదు కానీ అలాంటి కథలు ఆసక్తిగా ఉంటాయనే ఎంచుకుంటున్నాను అని తెలిపారు నెల్సన్.

సినిమా నుంచి విడుదలైన అరబిక్ కుత్తు పాట అనిరుధ్ శైలిలో ఉంటుంది.మేము అనుకున్న మధ్యవర్తి పాత్రకు సెల్వరాఘవన్ అయితేనే కరెక్ట్ గా ఉంటారని నిర్ణయించుకున్నాము.

గుర్కా సినిమాను కాపీ కొట్టినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.వాస్తవానికి షాపింగ్ మాల్ హైజాగ్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి.

బీస్ట్ సినిమా కూడా అలాంటిదే కానీ వేరే కోణంలో ఉంటుంది.దాదాపుగా 80% సన్నివేశాలు మాల్ లోనే చిత్రీకరించాము అని చెప్పుకొచ్చారు నెల్సన్.

దానయ్య మీద తీవ్రమైన కోపం తో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్… కారణం ఏంటంటే..?