డబ్బుల కోసం బట్టలు కూడా ఉతికిన స్టార్ డైరెక్టర్..పాపం ఇంకా ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే కష్టం.స్టార్టింగ్ లో చాలామంది కష్టాలు పడుతూ అన్నిటికీ ఓర్చుకుంటూ తిన్న తినకపోయినా పస్తులు ఉంటూ కూడా సినిమా మీద ఉన్న ఇంటరెస్ట్ తో వదిలేసి వెళ్లలేక ఇక్కడే ఉంటారు.

సినిమా అంటే అంత పిచ్చి ఉన్న జనాలకి ఎవరు ఏం చెప్పినా వాళ్లు మాత్రం ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోరు వాళ్ళకంటూ ఒక అవకాశం వచ్చేదాకా ఎదురుచూస్తూ ఉంటారు.

ఇప్పటిదాకా ఉన్న హీరోలు దర్శకులు అందరూ అలా ఇండస్ట్రీకి వచ్చి కష్టాలు పడి నిలదొక్కుకున్న వారే వాళ్లలో తమిళ్ డైరెక్టర్ మురుగదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.

"""/"/ ఆయన ఒక పేద కుటుంబంలో జన్మించారు సినిమా మీద ఉన్న ఇష్టంతో చెన్నై వచ్చి అక్కడ నానా కష్టాలు పడుతూ సినిమాలో అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు కానీ మొదట్లో పెద్దగా అవకాశాలు రాలేదు.

దాంతో ఆయన ఉండడానికి చాలా ఇబ్బంది అయ్యేది వాళ్ళ ఫ్రెండ్ మురుగదాస్ ఇద్దరు కలిసి ఒక రూం తీసుకుని ఉండేవారు మురుగదాస్ చిన్న చిన్న పని చేస్తూ వచ్చిన డబ్బుతో రూమ్ రెంట్ కడుతూ ఉండేవాడు కానీ తినడానికి డబ్బులు ఉండేవి కావు.

ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక ఫ్రెండ్ సలహా మేరకు కొంతమంది బట్టలు ఉతికితే డబ్బులు ఇస్తానని చెప్పారు అప్పటికే ఓనర్ కి ఆరు నెలల రెంటు కట్టాల్సి ఉంది.

అలా బట్టలు ఉతికి డబ్బులు సంపాదించే వారు.మురుగదాస్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా బట్టలు ఉతికే వాడు ఒకరోజు వాళ్ళిద్దరినీ చూసిన రూమ్ ఓనర్ మీరు వచ్చిన ఫీల్డ్ ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి ఇలా చేస్తే మీరు రూమ్ లో ఉండాల్సిన పనిలేదు వెళ్ళిపొండి అని చెప్పాడు.

మీరు డైరెక్టర్ కోసం ట్రై చేస్తున్నారు అంటే నేను మీకు రూమ్ ఇచ్చాను అంతే కానీ ఇలా చేస్తారంటే అసలు ఇచ్చేవాన్ని కాదు అనడంతో మురుగదాస్ మన బట్టలు చాకలి వాళ్ళు ఉతికితే తప్పు లేనప్పుడు ఎవరి బట్టలో మనం ఉతికితే తప్పేంటి సార్ అనడంతో మురగదాస్ ని కౌగిలించుకొని ఇంకో ఆరు నెలల వరకు రెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మీ డైరెక్షన్ ప్రయత్నాన్ని మాత్రం వదులుకోవద్దు అని చెప్పాడట.

"""/"/ తర్వాత చాలా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన పెద్దగా ప్రయోజనం లేదు దాంతో తనే కొన్ని స్టోరీలు రాసుకుంటూ వేరే వాళ్ళకి ఇచ్చి గోస్ట్ రైటర్ గా వర్క్ చేసేవాడు.

అలా పరిచయమైన డైరెక్టర్ ఎస్ జె సూర్య దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసి ఆ తర్వాత తనే ఒక మంచి కథ రాసుకుని అజిత్ దగ్గరికి వెళ్లి కథ చెప్పి ఆయనతో ఒక సినిమా తీశాడు.

ఆ సినిమా పెద్దగా ఆడలేదు దాంతో నిరాశ చెందకుండా ఇంకొక కథ రాసుకొని విజయ్ కాంత్ తో రమణ అనే సినిమాని తెరకెక్కించాడు అవినీతి నీ అంతం చేసే కథతో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో తమిళ ఇండస్ట్రీలో పెద్ద దర్శకుడిగా గుర్తింపు పొందాడు.

ఆ తర్వాత గజిని స్టోరీ రాసుకొని అజిత్ కి చెప్తే అజిత్ బిజీగా ఉండడం వల్ల తను చేయలేకపోయాడు.

దాంతో సూర్య ని పెట్టి గజిని సినిమా తీశాడు సినిమా తెలుగులో డబ్ అయి ఇక్కడ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మనందరికీ తెలుసు.

తెలుగులో సూర్య ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు.ఆ తర్వాత చిరంజీవి మురగదాస్ ని పిలిపించి మరి తనతో స్టాలిన్ సినిమా తీయించాడు ఈ సినిమా కూడా తెలుగులో మంచి హిట్ అయ్యింది.

అయితే హిందీ లో అమీర్ ఖాన్ తో గజిని సినిమాని తెరకెక్కించాడు అక్కడ ఆ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లను సాధించింది.

"""/"/ సినిమా మంచి హిట్ అవడంతో మురుగదాస్ పేరు ఇండియా మొత్తం మారుమ్రోగింది.

ముఖేష్ అంబానీ ఫ్యామిలీ సైతం ప్రత్యేకంగా ఒక షో వేయించుకుని గజిని సినిమా చూసి మురుగదాస్ ని చాలా బాగా తీశారు అని చెప్పి అతన్ని వాళ్ళ ఇంటికి లంచ్ కి పిలిచారు అంటే ఆ సినిమా వాళ్ళకి ఎంతగా నచ్చి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.

ఆ తర్వాత మురుగదాస్ విజయ్ తో తుపాకీ, కత్తి లాంటి సినిమాలు తీశారు.

సూర్య తో సెవెంత్ సెన్స్ అనే సినిమాను కూడా తెరకెక్కించారు మురుగదాస్ సినిమా తీసిన దాంట్లో ఏదో ఒక మెసేజ్ తప్పకుండా ఉంటుంది.

మహేష్ బాబుతో స్పైడర్ మూవీ చేశారు అది ఆశించినంతగా ఆడకపోయేసరికి తెలుగులో మురుగదాస్ సినిమాలు పెద్దగా చేయట్లేదు.

అయితే ఫ్యూచర్ లో మురుగదాస్ ఇంకా చాలా సినిమాలు తీసి హిట్ కొట్టాలని కోరుకుందాం.

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే మాటకి మురగదాస్ ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పవచ్చు.

ఎలిమినేట్ అయిన యష్మీ గౌడ..12 వారాలకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?