ఆయన సలహాలు తీసుకోవడం వల్లే గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ అయ్యిందట!

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

మరి ఈ సినిమా ముందు నుండి అంత బజ్ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ అంతా కలవర పడ్డారు.

అందుకే ఈ సినిమా రిజల్ట్ కోసం చిరుతో పాటు మెగా ఫ్యాన్స్ కు ఆతృతగా ఎదురు చూసారు.

ఇక ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేసారు.

మరి మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈ ఏడాది లోనే మంచి విజయంగా నిలవడంతో ఈ సినిమా డైరెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

ఈ సినిమా విజయం సాధించడంతో గ్రాండ్ గా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.

నిన్న మేకర్స్ సక్సెస్ పార్టీ నిర్వహించగా ఇందులో డైరెక్టర్ మోహన్ రాజా చిరంజీవి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.మోహన్ రాజా మాట్లాడుతూ.

చిరు సినిమాలో కలుగజేసుకుంటారు అంటే ఎవరినైనా కొడతా అని.ఆయన అనుభవాన్ని మనం ఉపయోగించుకోక పోతే ఫూల్స్ అవుతామని.

ప్రతీ అంశం లో ఆయన ఇన్ ఫుట్ తీసుకోవడం వల్ల గాడ్ ఫాదర్ ఈ రోజు బ్లాక్ బస్టర్ అయ్యింది అని మోహన్ రాజా చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ లో ఆసక్తిగా మారాయి.

"""/"/ తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

ఇందులో చిరుతో పాటు చాలా మంది స్టార్స్ నటించారు.లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించగా.

సత్యదేవ్ విలన్ పాత్రలో నటించాడు.అలాగే సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, అనసూయ, సునీల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.

కేరళ పోలీస్ శాఖ చొరవ .. ఎన్ఆర్ఐల కోసం స్పెషల్ హెల్ప్ లైన్