వకీల్ సాబ్ మూవీపై ఆశలు పెట్టుకున్న మారుతి.. ఎందుకంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు.పింక్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాను తెలుగు నేటివిటీకి తగిన విధంగా దర్శకుడు వేణు శ్రీరామ్ భారీగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు భారీగా వ్యూస్, లైక్స్ వస్తున్నాయి.

ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి కాగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతులు ఇవ్వడంతో దిల్ రాజు సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి ఆసక్తి చూపడం లేదు.

అయితే ఈ సినిమా ఫలితం కోసం దర్శకుడు మారుతి ఎదురు చూస్తున్నారని ఈ సినిమాపై మారుతి ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది.

మారుతి వకీల్ సాబ్ సినిమా ఫలితం గురించి ఎదురు చూడటానికి ముఖ్యమైన కారణమే ఉంది.

"""/"/ దర్శకుడు మారుతి, హీరో గోపీచంద్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.

ప్రతిరోజూ పండగే సినిమా తరువాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కూడా వకీల్ సాబ్ లా కోర్టు రూం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోంది.

కోర్టు రూం బ్యాక్ డ్రాప్ తోనే తెరకెక్కిన వకీల్ సాబ్ హిట్టైతే గోపీచంద్ మారుతి సినిమాకు కూడా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.

ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని గోపీచంద్ మారుతి సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.

ఫ్లాపుల్లో ఉన్న చాలామంది హీరోలకు విజయాలను అందించిన మారుతి గోపీచంద్ కు కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వైసీపీకే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో వార్ వన్ సైడ్!