లెంజడరీ డైరెక్టర్ గా మణిరత్నంను నిలబెట్టిన 7 ఆణిముత్యాల్లాంటి సినిమాలు
TeluguStop.com
మణిరత్నం.తన కంటూ ప్రత్యేక శైలిని కలిగిన దర్శకుడు.
విమర్శకులు సైతం ప్రశంసించే డైరెక్టర్.వైవిధ్యభరిత సినిమాలు తీయడంలో తనకు తానే సాటి.
భారతీయ సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్.ఈ దర్శక దిగ్గజం చేతిలో రూపుదిద్దుకున్న టాప్ 7 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గీతాంజలి
తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ హిట్ సాధించిన సినిమా.నాగార్జున హీరోగా 1989లో ఈ చిత్రం విడుదల అయ్యింది.
కేవలం 60 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యింది.ఈ సినిమాను యంగ్ డై ఫస్ట్ అనే ఇంగ్లీష్ సినిమా ప్రేరణతో మణిరత్నం ఈ సినిమా తీశాడు.
తన టాప్ చిత్రాల్లో ఇదో చిత్రం అంటారు ఆయన.నాయకుడు """/"/
తమిళనాడు నుంచి ముంబైకి వలస వెళ్లి అక్కడ ప్రముఖ వ్యక్తిగా ఎదిగిన వరదరాజన్ ప్రేరణతో తీసిన సినిమా నాయకుడు.
ఈ సినిమా కోసం 1987లోనే కోటి రూపాయలు ఖర్చు చేశారు.ఇందులో హీరోగా చేసిన కమల్ కు 17 లక్షల రూపాయలు ఇచ్చాడు.
దళపతి """/"/
1991 లోనే 3 కోట్ల రూపాయలతో ఈ సినిమా రూపొందించారు.రజనీకాంత్, మమ్ముట్టి ఈ సినిమాలో నటించారు.
అప్పట్లో ఈ సినిమా బంఫర్ హిట్ అయ్యింది.రోజా """/"/
కాశ్మీర్ సమస్యను తెరమీద చూపించిన సినిమా రోజా.
అరవింద్ స్వామి నటన, రెహ్మాన్ సంగీతం ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి.ఈ సినిమాకు 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి.
బొంబాయి """/"/
ముంబై అల్లర్ల నేపథ్యంలో ఈ సినిమాను తీశారు.అరవింద్ స్వామి హీరోగా చేసిన ఈ సినిమాకు ఓ జాతీయ పురస్కారం, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.
సఖి """/"/
మణిరత్నం సినిమాల్లో ఇదో మాస్టర్ పీస్.2000లో వచ్చిన ఈ సినిమాలో మాధవన్, షాలినీ నటన, మణిరత్నం టేకింగ్ అత్యద్భుతం.
యువ """/"/
సూర్య, మాధవ్ నటించిన పొలిటికల్ మూవీ యువ.విద్యార్థి రాజకీయాలను బేస్ చేసుకుని తీసిని ఈ సినిమా మంచి హిట్ సాధించింది.
రాత్రికి రమ్మని ఓపెన్ గా అడుగుతారు.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!