ఆ విషయం లోకేష్ కనక రాజ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు…

విషయంలో ఒక క్యారెక్టర్ కోసం డైరెక్టర్లు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక హీరోని గాని లేదా ఒక నటుడిని గాని ఊహించుకుంటారు అలా ఊహించుకుంటూ రాస్తేనే ఆ సీన్ కి సంబంధించిన ఎలివేషన్స్ అనేవి బాగా వర్క్ అవుట్ అవుతాయి.

అలాంటి సమయంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) డైరెక్షన్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక తెలుగులో డబ్ అయిన ఖైదీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. """/"/ ఇక ఈ సినిమా తర్వాత ఆయన రీసెంట్ గా విక్రమ్( Vikram ) అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును కొట్టి తన మార్క్ స్టామినా ఏంటో తెలుగు ప్రేక్షకులకు సైతం చూపించాడు.

ఇక ఈ సినిమా సక్సెస్ విషయంలో లోకేష్ కనకరాజు పాత్ర చాలానే ఉంది.

ఎందుకంటే ఆయన కమలహాసన్ అభిమాని అయినప్పటికీ ఆయన్ని ఎలా చూపిస్తే ఇపుడున్న ఉన్న ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అనే ఒక విషయంలో రీసెర్చ్ చేసి చేసిన ఈ సినిమా కమల్ హాసన్( Kamal Haasan ) గారి కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా అని చెప్పొచ్చు.

ఇక ప్రస్తుతం ఆయన ఇప్పుడు సక్సెస్ లో ఉన్నాడు కాబట్టి ఈ సినిమా అనేది మళ్లీ ఆయనకి ఒక బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి.

అయితే లోకేష్ కనకరాజు ఆయన తీసిన కొన్ని సినిమాల్లో ఉన్న క్యారెక్టర్ల కోసం కొంతమందిని అనుకున్నారట, కానీ ఇప్పటివరకు ఆయన సినిమాలో ఆయన రాసుకున్న క్యారెక్టర్లు ఎవరు కూడా చేయలేదు.

"""/"/ అంతా వేరే నటులే చేశారు ముఖ్యంగా ఖైదీ లో మొదట హీరోగా వేరే నటుడుని అనుకొని ఆ తర్వాత కార్తీ ని తీసుకోవడం జరిగింది.

చివరికి ఆ సినిమా కార్తీ చేసి సూపర్ హిట్ అవడం అంతా జరిగిపోయింది.

ఇక మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) చేసిన ఆ క్యారెక్టర్ కోసం మొదటగా నాని ని తన మైండ్ లో ఉంచుకొని ఆ స్క్రిప్ట్ రాసుకున్నట్టుగా లోకేష్ కనకరాజు తెలియజేశారు.

కానీ చివరికి విజయ్ సేతుపతి ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది.ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ కోసం మొదట గా రాఘవ లారెన్స్( Raghava Lawrence ) ని అనుకున్నారట.

కానీ చివరగా విజయ్ సేతుపతి చేయాల్సి వచ్చింది.ఇక ఇలా ఆయన ఒక యాక్టర్ ని అనుకుంటే మరొక యాక్టర్ ఆ సినిమాలో నటించడం జరిగింది.

ఆ ముగ్గురు హీరోలతో సినిమా చేయడమే నా కల… బన్నీవాసు కామెంట్స్ వైరల్!