లియో నెగిటివ్ కామెంట్ల పై స్పందించిన డైరెక్టర్ లోకేష్… ఏమన్నారంటే?
TeluguStop.com
డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ( Director Lokesh Kanagaraj ) దర్శకత్వంలో ఎన్నో అంచనాల నడుమ హీరో విజయ్ (Vijay) నటించినటువంటి చిత్రం లియో ( Leo ).
దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ మిశ్రమ స్పందన లభించుకుంది.
లోకేష్ ఇదివరకు నటించిన విక్రమ్ సినిమా భారీ వసూళ్లను రాబట్టడంతో లియో సినిమాపై కూడా భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.
ఈ క్రమంలోనే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కూడా జరిగాయి.ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్ దసరా పండుగ కావడంతో ఈ సినిమా భారీగానే కలెక్షన్స్ కూడా రాబడుతుంది.
"""/" /
లియో సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.మరి ఈ సినిమా ఆ అంచనాలను చేరుకోలేక పోవడమే కాకుండా సినిమా పట్ల నెగిటివ్ కామెంట్స్( Negative Comments ) కూడా రావడంతో ఇప్పటివరకు చిత్రబంధం స్పందించలేదు.
ఇక ఈ సినిమా విడుదలైన క్షణం నుంచి డైరెక్టర్ లోకేష్ పూర్తిగా మీడియాకు దూరంగా ఉన్నారు.
ఇలా మీడియాకు దూరంగా ఉన్నటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ సినిమా గురించి వస్తున్నటువంటి నెగిటివ్ కామెంట్లపై స్పందిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
"""/" /
ఈ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ మాట్లాడుతూ.లియో సినిమాని జనాలు బాగా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.
తాను నెట్వర్క్ కవరేజ్ ఏరియాకు దూరంగా ఉన్నానని మరొక నాలుగైదు రోజులలో తాను ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతానని తెలియజేశారు.
ఈ సినిమా పట్ల ఆడియన్స్ రెస్పాన్స్( Audience Response ) ఏంటి అనే విషయాన్ని తాను తెలుసుకొని, వారి అభిప్రాయాలు బట్టి నా తదుపరి సినిమాల విషయంలో ఎలాంటి మార్పులు చేయాలి ఏంటి అనే విషయాల గురించి ఆలోచిస్తానని తెలిపారు.
ప్రస్తుతానికైతే తాను ఏ విధమైనటువంటి రివ్యూలను తెలుసుకోలేదు అంటూ ఈ సందర్భంగా లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి కి లెజెండరీ అవార్డు మోహన్ బాబు వల్ల మిస్ అయిందా..? నాగార్జున వల్ల దక్కిందా..?