కార్తీ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్.. హీరోహీరోయిన్లుగా వాళ్లు ఎంపికయ్యారా?

తమిళ హీరో కార్తీ, టాలీవుడ్ బ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆవారా.

2010లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే ఆ సమయంలో దాదాపుగా 13 కోట్లు వసూలు చేసి భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు బాక్సాఫీ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.

ఇక ఆవారా సినిమాతో హీరో కార్తీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది.

అయ్యా అనే టైటిల్ తో తమిళంలో విడుదల రూపొందిన ఆ సినిమాను ఆవారా పేరుతో తెలుగులో విడుదల చేశారు.

ఈ సినిమా భారీగా విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తర్వాత హీరో కార్తీక్ పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

"""/"/ ఈ సినిమా తర్వాత కార్తీక్ ఏ సినిమా నటించిన కూడా తెలుగు తమిళంలో ఏక కాలంలోనే విడుదల అవుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఆవారా సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు లింగస్వామి.

కాగా డైరెక్ట్ లింగస్వామి ఇటీవలే రామ్ పోతినేని హీరోగా నటించిన ది వారియర్ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

ఇకపోతే తన తదుపరి సినిమా ఆవారా కి సీక్వెల్ ని రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ సీక్వెల్ కథని కార్తీ,సూర్యలకు చెప్పగా అందుకు వాళ్లు నో చెప్పడంతో హీరో ఆర్య కి చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక వెంటనే హీరో ఆర్య ఓకే చేసినట్టుగా తెలుస్తోంది.దీంతో ఆవారా 2 సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు దర్శకుడు లింగస్వామి.

"""/"/ అంతేకాకుండా కాస్టింగ్ టెక్నీషియన్లను కూడా ఎంపిక చేసే పనిలో పడ్డారు.ఇందులో హీరోయిన్ గా పూజ హెగ్డే అయితే బాగుంటుందని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మరి పూజ హెగ్డే ఈ సినిమాకు ఓకే చెప్తుందా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

మరి ఈ సినిమా ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి మరి.

క్రిస్మస్ స్టాకింగ్‌లో లాటరీ టికెట్.. ఒక్క రాత్రిలో కోటీశ్వరురాలైంది..!