పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రియల్ హీరో అంటున్న క్రిష్ణ వంశీ.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మొన్నటి వరకు వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేవలం రాజకీయాలపైనే పూర్తి ఫోకస్ ను పెట్టారు.

ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు మరొకవైపు రాజకీయాలకు సంబంధించిన విషయాలను కూడా పట్టించుకుంటున్నారు.

"""/" / అందులో భాగంగానే హరిహర వీరమల్లు( Harihara Veeramallu ) సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

అయితే విషయంలో పవన్ పై చాలా కామెంట్స్ కూడా వినిపిస్తూ వస్తున్నాయి.అయితే తనపై మన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ ( Director Krishna Vamsi )పవన్ పై ప్రశంసలు కురిపించారు.

నాకు కళ్యాణ్ గారు అంటే ఎంతో గౌరవం అని ఫైనల్ గా కలుషితం అయ్యిన అవినీతి రాజకీయాల్లోకి విలువల్ని తీసుకొచ్చే పవన్ లాంటి రాజకీయ నాయకులు ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అని కృష్ణవంశీ తెలిపారు.

"""/" / దీనితో పవన్ పై కృష్ణ వంశీ పోస్ట్ లు వైరల్ గా మారాయి.

ప్రస్తుతం ఆ పోస్టులను చూసినా అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇకపోతే గత నాలుగు ఐదు రోజులుగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండడంతో పాటు సెలబ్రిటీలపై మండిపడిన విషయం కూడా తెలిసిందే.

ముఖ్యంగా తిరుపతి లడ్డు వివాదం పై పలువురు సెలబ్రిటీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వివాదాలు ఎక్కువగా నడుస్తున్నాయి.

Validation Check 2026-03-24 19:38:18