రీ రిలీజ్ అంటే దండం పెట్టేసిన కృష్ణవంశీ.... అసలేమైందంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఒకరు.

ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.అయితే ప్రస్తుతం కృష్ణ వంశీ సినిమాల సంఖ్య తగ్గిపోతుంది.

డైరెక్టర్ గా మాత్రమే కాకుండా నిర్మాణ సంస్థను స్థాపించి సింధూరం అనే సినిమాను నిర్మించిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా కృష్ణవంశీకి భారీగా ఆర్థిక నష్టాలను తీసుకువచ్చింది.ఇకపోతే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లను రాబడుతున్నాయి.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ కృష్ణ వంశీ సింధూరం సినిమాని తిరిగి విడుదల చేయాలని కోరారు.

కృష్ణ వంశీ గారు ఒక్కసారి సింధూరం సినిమాని రీ రిలీజ్ చేయండి ఈ సినిమా కనుక తిరిగి విడుదలయితే నాలాంటి వాళ్లు నాలుగు షోలు చూడటానికి సిద్ధంగా ఉన్నాము.

దయచేసి మా ఆశ నెరవేర్చాలని నా జీవితంలో చూసిన గొప్ప సినిమా సింధూరం ఈ సినిమాని తిరిగి చూసే అవకాశాన్ని కల్పించండి అంటూ ట్వీట్ చేస్తూ కృష్ణవంశీని టాగ్ చేశారు.

"""/"/ ఈ క్రమంలోనే కృష్ణవంశీ స్పందిస్తూ.అమ్మో ఈ సినిమా చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు అప్పులు కట్టానయ్యా వామ్మో అంటూ ఏకంగా దండం పెట్టేసాడు.

ఈ సందర్భంగా సింధూరం సినిమా గురించి కృష్ణవంశీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయినా ఎన్నో అవార్డులను అందుకుంది.

1997 సెప్టెంబర్ 12వ తేదీ విడుదలైన ఈ సినిమా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది.

అలాగే ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డును కూడా అందుకుంది.ఇలా ఎన్నో పురస్కారాలను అందుకున్న సింధూరం సినిమా తనకు మాత్రం చాలా ఆర్థిక నష్టాలను తీసుకువచ్చిందని కృష్ణవంశీ స్వయంగా వెల్లడించారు.

యూఎస్: 6 నెలల కోమా నుంచి లేచిన వ్యక్తి.. హాస్పటల్ బిల్లు చూసి షాక్..!