పవన్ కళ్యాణ్ దెబ్బకి సినిమాలకు గుడ్ బై చెప్పేసిన డైరెక్టర్ క్రిష్!

మన టాలీవుడ్ లో భిన్నమైన ఆలోచలనతో సున్నితమైన అంశాలను తీసుకొని సినిమాలను తెరకెక్కించే దర్శకుల లిస్ట్ తీస్తే అందులో క్రిష్(Krish Jagarlamudi ) మొదటి వరుసలో ఉంటాడు.

గమ్యం లాంటి గొప్ప సినిమాతో ప్రారంభమైన క్రిష్ కెరీర్,ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ మరియు గౌతమీ పుత్ర శాతకర్ణి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసాడు.

ఇవి కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.

అయితే ఈయన లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'హరి హర వీరమల్లు( Hari Hara Veera Mallu )' అనే సినిమాని ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.

మూడేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా ఇప్పటి వరకు పూర్తి కాలేదు.నిర్మాత ఏఎం రత్నం లేటెస్ట్ కామెంట్స్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్తి అయ్యింది.

మిగిలిన పార్ట్ పవన్ కళ్యాణ్ 30 రోజుల డేట్స్ ఇస్తే అయిపోతుంది. """/" / కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ మాత్రం ఇవ్వడం లేదట, ఈ విషయంపై డైరెక్టర్ క్రిష్ చాలా అసంతృప్తి తో ఉన్నాడట.

'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు పూర్తి చేసి విడుదల చేసాడు.

కానీ 'హరి హర వీరమల్లు' చిత్రం పూర్తి చెయ్యడానికి మాత్రం ఎందుకో ఆయన ఆసక్తి చూపడం లేదు.

ఫస్ట్ హాఫ్ మొత్తం షూటింగ్ అయిపోయింది, ఔట్పుట్ కూడా అద్భుతంగా వచ్చింది అని ఫిలిం నగర్ లో ఒక టాక్ ఉంది.

కానీ సెకండ్ హాఫ్ మాత్రం పవన్ కళ్యాణ్ కి నచ్చలేదట.ఇప్పటికీ రెండు మూడు సార్లు మార్పులు చేర్పులు చేసి తీసుకొచ్చినా కూడా ఎందుకో ఆయన సంతృప్తి చెందడం లేదు.

వారాహి ప్రారంభం అయ్యే ముందు సెకండ్ హాఫ్ ఫైనల్ వెర్షన్ ని లాక్ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ డేట్స్( Pawan Kalyan ) ఎప్పుడు ఇస్తాడో తెలియని పరిస్థితి.

"""/" / ఎన్నికలు పూర్తి అయ్యే వరకు పవన్ కళ్యాణ్ ఏ సినిమాకి కూడా డేట్స్ ఇవ్వడు, ఒకవేళ డేట్స్ ఇచ్చినా ముందుగా ఆయన పూర్తి చేసే సినిమాలు 'ఓజీ' మరియు 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలే.

ఆ తర్వాత అయినా 'హరి హర వీరమల్లు'కి డేట్స్ ఇస్తాడో లేదో అనుమానమే.

అయితే ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వం కి గుడ్ బై చెప్పేసి నిర్మాణ రంగం వైపు ఆసక్తి చూపబోతున్నట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్ కారణంగా ఆయనకీ దర్శకత్వం పై విరక్తి కలిగి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా?, లేకపోతే ఎప్పటి నుండో ఇది ఆయన మనసులో ఉందా అనేది తెలియాల్సి ఉంది.

ఏంటి జూనియర్ ఎన్టీఆర్ చేజేతులా ఇంత పెద్ద నష్టం తనకు తానే చేసుకున్నారా ?