రకుల్ ని ఆకాశానికి ఎత్తేసిన దర్శకుడు క్రిష్

రకుల్ ని ఆకాశానికి ఎత్తేసిన దర్శకుడు క్రిష్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.

రకుల్ ని ఆకాశానికి ఎత్తేసిన దర్శకుడు క్రిష్

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో మొదటి హిట్ కొట్టిన ఈ భామ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చింది.

రకుల్ ని ఆకాశానికి ఎత్తేసిన దర్శకుడు క్రిష్

ఐదేళ్లలో అందరి హీరోలతో సినిమాలు చేసిన రకుల్ ప్రస్తుతం స్టార్ హీరోలతో రెండు సినిమాలు చేస్తుంది.

అందులో కొత్త హీరో వైష్ణవ్ తేజ్ తో ఒకటిగా, యూత్ స్టార్ నితిన్ తో చెక్ సినిమాలో లాయర్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా రకుల్ ప్రీత్ సింగ్ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు కూడా వినిపించడంతో ఆమెకి డ్రగ్స్ అలవాటు ఉందని ప్రచారం జరిగింది.

రియాతో ఉన్న సన్నిహిత సంబంధాలు రకుల్ ని ఇబ్బందులకి గురి చేశాయి.పోలీసుల విచారణ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

అయితే ఈ వ్యవహారంలో తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కి క్లీన్ చిట్ వచ్చినట్లు తెలుస్తుంది.

మరల యధాప్రకారం సోషల్ మీడియాలో రకుల్ రెండు వారాల తర్వాత యాక్టివ్ అయ్యింది.

తాజాగా రకుల్ పుట్టినరోజు సందర్భంగా చాలా మంది సినీ ప్రముఖులు ఆమెకి విషెస్ చెప్పారు.

అదే సమయంలో రకుల్ వ్యక్తిత్వానికి కూడా గుడ్ సర్టిఫికెట్ ఇచ్చారు.ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ తో రకుల్ ఓ సినిమా చేస్తుంది.

ఈ సినిమాలో ఆమె ట్రైబల్ యువతి పాత్రలో నటిస్తుంది.సెట్ లో ఆమె పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయిన దర్శకుడు క్రిష్ తాజాగా ఆమెపై ప్రశంసలు కురిపించారు.

వృతి ప‌ట్ల ర‌కుల్ ప్రీత్ సింగ్ కున్న డెడికేషన్, ర‌కుల్ విన‌య‌ పూర్వ‌క స్వ‌భావానికి క్రిష్ ప్రశంసించారు.

ప్ర‌తీ రోజు నీ ప‌ని చూస్తున్నంత‌సేపు వృతిప‌ట్ల నీకున్న అంకిత‌భావం, క్ర‌మ‌శిక్ష‌ణ, టాలెంట్ తో నీపై గౌర‌వం మ‌రింత పెరిగింది.

నువ్వు గొప్ప విన‌యం క‌లిగిన ధృడమైన వ్య‌క్తి అంటూ క్రిష్ ట్వీట్ చేశారు.

కెనడా కొత్త కేబినెట్‌లో ఇద్దరు భారత సంతతి మహిళలు..!