ఆఫీస్ బాయ్ లా ఆ పని చేసిన హీరో వైష్ణవ్ తేజ్.. ఏం జరిగిందంటే?

సాధారణంగా ఏ హీరో అయినా షూటింగ్ సమయంలో చిన్నచిన్న పనులు చేయడానికి అస్సలు ఇష్టపడరు.

క్రేజ్, మార్కెట్ ఉన్న హీరోలు అయితే ఆ పనులకు మరింత దూరంగా ఉంటారు.

వైష్ణవ్ నటించిన కొండపొలం సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న క్రిష్ సినిమాకు కొన్ని పరిమితులు ఉంటాయని నవలకు పరిధి ఎక్కువని తెలిపారు.

కొండపొలం నవలలో సినిమా కథకు కావాల్సిన లక్షణాలు ఉన్నాయని క్రిష్ వెల్లడించారు.సినిమాలో ఓబులమ్మ పాత్రను కొత్తగా రాసుకున్నామని క్రిష్ చెప్పుకొచ్చారు.

కరోనా సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా షూటింగ్ చేశామని క్రిష్ అన్నారు.

అడవిలో షూటింగ్ కాబట్టి షూటింగ్ కు సంబంధించిన ప్రతి వస్తువును కొండపైకి మోయాలని వెయ్యి గొర్రెలను కొండపైకి తీసుకెళ్లడం చాలా పెద్ద ఛాలెంజ్ అని క్రిష్ అన్నారు.

"""/"/ హీరో వైష్ణవ్ తేజ్ సైతం ఆఫీస్ బాయ్ లా సామాన్లు మోశారని క్రిష్ చెప్పుకొచ్చారు.

మనుషులకే తాగడానికి నీళ్లు లేని ప్రాంతంలో వెయ్యి గొర్రెలకు నీళ్లు ఎలా అనే కథతో ఈ సినిమా తెరకెక్కిందని క్రిష్ ప్రశ్నించారు.

ఈ సినిమా ద్వారా గొర్రెల భాష అర్థం కాకపోయినా గొర్రెలతో ఏ విధంగా మసులుకోవాలో అర్థమైందని చెప్పుకొచ్చారు.

సినిమాలోని రవీంద్ర యాదవ్ పాత్రకు వైష్ణవ్ సూట్ అవుతాడని తనకు అనిపించిందని క్రిష్ వెల్లడించారు.

"""/"/ రకుల్ లో తనకు అందమైన గొల్లపిల్ల కనిపించడంతో ఈ సినిమా కథను ఆమెకు చెప్పానని క్రిష్ పేర్కొన్నారు.

ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకుని ఓటీటీ ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేశానని క్రిష్ చెప్పుకొచ్చారు.

క్రిష్ కొండపొలం సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతుండగా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కిన నటుడు సుబ్బరాజు… ఫోటోలు వైరల్!