ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం కోసం 80 కోట్లు విలువ చేసే కెమెరా సిద్ధం..కొరటాల ప్లానింగ్ మామూలుగా లేదు!
TeluguStop.com
షూటింగ్ చాలా ఆలస్యం గా మొదలైన ఈ సినిమా అప్పుడు నాలుగు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుందట.
ఎట్టిపరిస్థితి లో ఈ సినిమాని ఏప్రిల్ 5 వ తారీఖున విడుదల చెయ్యాలనే పట్టుదలతో డైరెక్టర్ కొరటాల శివ( Director Koratala Siva ) ఉన్నాడట.
ఈ ఏడాది నవంబర్ లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవుతాయట.
ఆ తర్వాత సెప్టెంబర్ నుండి ఎన్టీఆర్ హ్రితిక్ రోషన్ తో కలిసి 'వార్ 2' చిత్రం చెయ్యబోతున్నాడు.
'ఆచార్య' లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ తీస్తున్న చిత్రం ఇది.
ఈ స్క్రిప్ట్ కోసం కొరటాల శివ రెండు సార్లు రీ వర్క్ చేసాడు.
కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి అనే కసితో కథని తయారు చేసాడు. """/" /
ఇక ఈ చిత్రం లో పని చేసే తారాగణం కూడా భారీగానే ఉంది.
ఇప్పటికే ఈ సినిమా లో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
రీసెంట్ గానే అండర్ వాటర్ లో వీళ్లిద్దరి మీద ఒక భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించాడు కొరటాల శివ.
ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ కాబోతుందట.అంతే కాదు ఈ సినిమా కోసం 'అర్రి అలెక్స్ LF ' కెమెరాని ఉపయోగిస్తున్నారట.
దీని ఖరీదు సుమారు గా 80 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.
ఈ కెమెరా తో ఇప్పటి వరకు 'జాన్ విక్ 4 ', 'ది బ్యాట్ మ్యాన్','జోకర్', 'యాంట్ మ్యాన్', 'స్ట్రేంజర్ థింగ్స్', 'డ్యూన్' మరియు 'టెర్మినేటర్' వంటి హాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించారు.
"""/" /
ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడు.అందులో ఒక పాత్ర పేరు దేవర,( Devara ) సముద్ర ఖనిజాలను స్ముగ్లింగ్ చేసే పాత్రలో ఇందులో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.
ముఖ్యంగా అండర్ వాటర్ లో వచ్చే పోరాట సన్నివేశాలు మొత్తం ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతుందట.
ఎన్టీఆర్ నట విశ్వరూపం మొత్తం ఈ సినిమా లో చూడొచ్చని అంటున్నారు.ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
ఇక టీజర్ వచ్చే సమయానికి అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు.
చూడాలి మరి ఎన్టీఆర్ ఈ సినిమాతో మరో సారి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాడో లేదో అనేది.
ప్రశాంత్ మూవీ కోసం ఆ రాష్ట్రానికి వెళ్లనున్న ఎన్టీఆర్.. తొలిసారి అలా చేస్తున్నారా?