ఈగల్ సినిమా సక్సెస్ అయితేనే తను ఇండస్ట్రీలో ఉంటాడు..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.
ఇప్పుడు ఈగల్ సినిమాతో( Eagle Movie ) కార్తీక్ ఘట్టమనేని( Karthik Ghattamaneni ) కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి మన ముందుకు వస్తున్నాడు.
అయితే ఈ సినిమా మీదనే తను పూర్తి ఆశలను పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఆయన ఇంతకు ముందు చేసిన సూర్య వర్సెస్ సూర్య సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు దాంతో ఈ సినిమా మీద ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
ఇక ఈ సినిమా సక్సెస్ అయితేనే అతనికి ఇంకొక సినిమా ఉంటుంది లేకపోతే మాత్రం మళ్ళీ ఆయన డిఓపి గానే( DOP ) కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది.
అందుకే ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కించినట్టుగా కూడా తెలుస్తుంది. """/" /
మరి ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ తోని ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ఆయన ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ టైంలో రవితేజకు( Raviteja ) కూడా కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాతో రవితేజ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
ఒక్క సినిమాతో ఇద్దరి లైఫ్ లు సెటిల్ అవుతాయని చెప్పడం లో ఎంత మాత్రం అతిశక్తియోక్తి లేదు.
"""/" /
కానీ నిజానికి రవితేజ కంటే కూడా ఈ సినిమా కార్తీక్ ఘట్టమనేనికి చాలా కీలకంగా మారనుందనే చెప్పాలి.
ఇక ఈ సినిమా తో సక్సెస్ కొడితే కార్తీక్ చాలా పెద్ద డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు.
అయితే ఈ సినిమా మేకింగ్ చాలా బాగా డిజైన్ చేసినట్టు గా ట్రైలర్( Eagle Movie Trailer ) చూస్తుంటే అర్థం అవుతుంది.
కానీ ఫుల్ సినిమా చూస్తేనే ఈ సినిమా ఎలా ఉంటుందో మనకు అర్థం అవుతుంది.
శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా..?