ఆ సినిమాకి డైరెక్టర్ విఠలాచార్య అనుకున్నారు.. రాఘవేంద్రరావుకి మతిపోయింది..?
TeluguStop.com
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు( K Raghavendra Rao ) రొమాంటిక్ కామెడీ, ఫాంటసీ, మెలోడ్రామా, యాక్షన్ థ్రిల్లర్, బయోగ్రాఫికల్ వంటి అనేక జానర్లలో 100కు పైగా సినిమాలు డైరెక్ట్ చేసి చరిత్ర సృష్టించాడు.
లెక్కలేనని బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాడు."నమో వెంకటేశ (2017)" అతని లాస్ట్ మూవీ.
ఈ మూవీ తర్వాత పెళ్లి సందD సినిమా డైరెక్షన్‌ను సూపర్‌వైజ్ చేశాడు.ఇందులో "వశిష్ట" రోల్ కూడా పోషించాడు.
కృష్ణ తులసి, సిరిసిరిమువ్వ సన్నాఫ్ అనసూయ వంటి టీవీ సీరియల్స్‌కు కూడా దర్శకత్వం వహించాడు.
కెరీర్ ప్రారంభించిన సమయం నుంచి 'ఇక దర్శకత్వం చేయలేను' అనే వయసు వచ్చేంతవరకు ఆయనకు గడ్డుకాలం రాలేదు.
కానీ ఒకానొక సమయంలో ఈ దర్శకుడు తీసిన అగ్ని, రుద్రనేత్ర, ఒంటరిపోరాటం సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
దాంతో రాఘవేందర్రావు పని అయిపోయిందని అందరూ అనుకున్నారు.ఇలాంటి సమయంలో ఆయన అదృష్టం కొద్దీ చిరంజీవితో కలిసి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’( Jagadeka Veerudu Atiloka Sundari ) సినిమా చేసే అవకాశం దక్కింది.
కానీ ఆ సినిమాకి విఠలాచార్య( Vittalacharya ) దర్శకుడు అనుకున్నారు.మూడు రోజులపాటు మూవీకి కలెక్షన్లు రాలేదు.
దాంతో ఏం జరుగుతుందో అర్థం కాక రాఘవేంద్రరావు అయోమయంలో పడిపోయారు.ఈ ఆసక్తికరమైన సంఘటనల గురించి స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"""/" /
1990 మే 9న చిరంజీవి,( Chiranjeevi ) శ్రీదేవి( Sridevi ) హీరో హీరోయిన్లుగా వైజయంతి మూవీస్ ప్రొడక్షన్‌లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఈ సినిమా విడులైంది.
దాదాపు 35 ఏళ్ల క్రితం ఈ సినిమాని రూ.2కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.
అప్పటికే అదే హైయ్యెస్ట్.ఆయన ఇంటర్వ్యూలో ఆ లైఫ్ ఫేజ్ గురించి మాట్లాడుతూ "జగదేకవీరుడు అతిలోక సుందరికి ముందు నా 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
నా పనైపోయింది అని ఇండస్ట్రీలో ఒక టాక్ మొదలయ్యింది.అలాంటి సమయంలో చిరంజీవి, అశ్వనీదత్ ఓ ఫాంటసీ ఫిలిం స్టోరీ తీసుకొని నా వద్దకు వచ్చారు.
ఈ సినిమా నేను మాత్రమే డైరెక్ట్ చేయగలనని నమ్మారు.డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు.
" అని తెలిపాడు. """/" /
రాఘవేంద్రరావు ఇంకా మాట్లాడుతూ "దీనికి ఇళయారాజా( Ilayaraja ) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాలి.
డబుల్ పాజిటివ్ రష్ చూసిన ఆయన ‘దీనికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవసరం లేదు.
ఇలానే విడుదల చేసినా సూపర్ హిట్ అవుతుంది.అంత గొప్పగా సినిమా ఉంది’ అనడంతో నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యా.
ఆ హ్యాపీనెస్‌తోనే అమెరికాకు ఫ్లైట్ ఎక్కా." అని చెప్పాడు.
కానీ అతని హ్యాపీనెస్ ఎంతో కాలం నిలవలేదు.ఈ మూవీ రిలీజ్ అయిన మూడు రోజులు పాటు కలెక్షన్లు రాలేదు.
"""/" /
ఈ సినిమాలను విఠలాచార్య మాత్రమే తీస్తాడనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడడం వల్ల దానికి దర్శకుడు విఠలాచార్యనే అని అనుకున్నారు.
మూవీ రిలీజ్ అయిన మూడవ రోజు నుంచి భారీ వర్షాలు కురవడం మొదలుపెట్టాయి.
ఎలాంటి మంచి టాక్ రాకపోవడం, పైగా వర్షాలు కురవడం వల్ల సినిమా థియేట్రికల్ రన్ అయిపోయినట్లే అని అందరూ అనుకున్నారు.
కానీ అప్పుడే ఒక అద్భుతం జరిగింది.మూడో రోజు నుంచి ప్రేక్షకులు ఈ సినిమాని చూసేందుకు పోటెత్తారు.
వర్షాలను కూడా లెక్క చేయలేదు.థియేటర్లలోకి నీళ్లు వచ్చినా కుర్చీలపైకి ఎక్కి మరీ సినిమా చూశారు.
చివరికి ఈ మూవీకి రూ.15 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
అలా రాఘవేంద్రరావు ఈ సినిమా ద్వారా ఫ్లాప్‌ల నుంచి బయటకు వచ్చాడు."అంతటి సెన్సేషనల్ మూవీ మళ్లీ రాదు దాన్ని చేయలేం కూడా" అని రాఘవేంద్రరావు ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
మాలాంటి హీరోలకు అలాంటి డైలాగు చెప్పే హక్కు లేదు: దుల్కర్ సల్మాన్