నాకు జన్మనిచ్చినది తల్లిదండ్రులు అయితే సినిమాకు జన్మనిచ్చినది ఎన్టీఆర్.. రాఘవేంద్రరావు

గుంటూరు జిల్లా, తెనాలి: మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్వర్యంలో NTR శతజయంతి ఉత్సవాలలో భాగంగా NVR కన్వెన్షన్ హాల్ లో ప్రముఖ సినీ దర్శకులు కె.

రాఘవేంద్రరావుకు సన్మానం కార్యక్రమం.ఎన్.

టి.అర్.

విగ్రహానికి రాఘవేంద్రరావు పుష్ప మాలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కి ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గున్న మహ్మద్ సాబిర్ సినీ రచయిత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర్రప్రసాద్, మాజీమంత్రి నక్కా ఆనందబాబు మాజీ మహిళకనిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సినీ సంభాషణ రచయిత బుర్ర సాయిమాధవ్ ప్రముఖ పారిశ్రామిక వేత్త కె, వి.

రావు పలువురు టి.డి.

పి.కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

రాఘవేంద్రరావు మాట్లాడుతూ.నాకు జన్మనిచ్చినది తల్లిదండ్రులు అయితే సినిమాకు జన్మనిచ్చినది ఎన్టీఆర్.

నా మొదటి సినిమా ఎన్టీఆర్ తోనే ప్రస్థానం మొదలు అయ్యింది.సినిమాలకి ప్రజలు డబ్బులు చల్లిన చరిత్ర ఎన్టీఆర్ తో నే మొదలు అయ్యింది.

ఆయన పురస్కారం అందుకోవడం ఎన్టీఆర్ యె పైన నుంచి నాకు పంపారు.ఏ పాత్రలు వేసిన ఎంత మంది నటులు ఉన్న ఎన్టీఆర్ ముందుగా గుర్తుకువస్తారు.

అందరు భారత రత్న రాలేదని అనుకుంటున్నారు ఎన్టీఆర్ భారత రత్న కాదు ప్రపంచ రత్న.

సంవత్సరం పాటు శతజయంతి ఉత్సవాలు చెయ్యటం ప్రపంచ చరిత్రలో ఎన్టీఆర్ కే దక్కుతుంది.

ఎన్టీఆర్ సంవత్సర శతజయంతి ఉత్సవాలు చేస్తున్న తెనాలి వాసులకు ముఖ్యంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి నా కృతజ్ఞతలు తెలిపారు.

పార్కింగ్ రూల్ బ్రేక్ చేసింది.. రూ.11 లక్షల జరిమానా విధించడంతో..?