భీమ్లా నాయక్ పై రివ్యూ ఇచ్చిన హరీష్ శంకర్..అలా ఉందంటూ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా గురించే ప్రస్తుతం అందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఎందుకంటే ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఎన్నో రోజుల పవర్ స్టార్ అభిమానుల కల ఈ రోజుకు నెరవేరింది.

ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మాములు ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.

ఆ ఎదురు చూపులకు ఈ రోజుతో తెర పడింది.ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఫ్యాన్స్ చేస్తున్న పూనకాలతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఉన్న థియేటర్స్ అన్ని కూడా దద్దరిల్లి పోతున్నాయి.

పవన్ స్ట్రామ్ ఒక రేంజ్ లో థియేటర్ లలో హల్ చల్ చేస్తుంది.

చాలా రోజుల తర్వాత పవన్ నుండి పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి.

"""/" / సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి ప్రీమియర్స్ ద్వారానే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన భీమ్లా నాయక్ ముందు ముందు ఇంకెన్ని వసూళ్లు సాధించి మరిన్ని రికార్డులను బద్దలు కొడుతుందో వేచి చూడాలి.

ఇది ఇలా ఉండగా పవన్ డైరెక్టర్ హరీష్ శంకర్ భీమ్లా నాయక్ సినిమాపై రివ్యూ ఇచ్చేసాడు.

"""/" / 'కొంచెం గ్యాప్ తర్వాత గర్జించే పవన్ కళ్యాణ్ ని చూసాను.

డైరెక్టర్ సాగర్ కే చంద్ర, త్రివిక్రమ్ పనితీరు అద్భుతం.నాగవంశీ అండ్ టీమ్ అందరికి శుభాకాంక్షలు.

తమన్ బావ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.తన కెరీర్ లో బెస్ట్ వర్క్ ఇచ్చాడు.

ఇది కులం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాదు భీమ్లా కి బ్యాక్ బోన్.

ఇక లాస్ట్ రానా గురించి చెప్పాలి.నేను రానాని చూడలేదు.

డానియల్ శేఖర్ ని మాత్రమే చూసని.దీని తర్వాత ప్రతి ఒక్కరు రానా నీ ఫ్యాన్స్ వేటింగ్ ఇక్కడ అంటారు.

అని హరీష్ ట్విట్టర్ వేదికగా భీమ్లా నాయక్ పై ఇచ్చిన రివ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.

సందీప్ కిషన్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న నాగార్జున హీరోయిన్…