Director DevaKatta: ఎవరు ఔనన్నా కాదన్న ..ఈ డైరెక్టర్ ఒక ఇంటెలిజెంట్
TeluguStop.com
చాల మంది టెక్నీషియన్స్ ఇండస్ట్రీ కి వస్తుంటారు పోతుంటారు.కానీ కొంత మంది మాత్రమే చేసిన అతి తక్కువ సినిమాలతో జనల మనస్సులో పాతుకపోతు ఉంటారు.
అలంటి ఒక దర్శకుడే దేవా కట్ట.( Director DevaKatta ) సినిమా ఇండస్ట్రీ మొదటి నుంచి ఎలాంటి సంబంధం లేని దేవా కడప లో పుట్టి పెరిగాడు.
మెకానికల్ ఇంజనీరింగ్ చేసి అందరి లాగానే అమెరికాలో ఉద్యోగం చేసి అక్కడి పౌరసత్వం కూడా పొందాడు.
2005 లో మొదటి సారి వెన్నెల ( Vennela Movie ) అనే సినిమా తో మెగా ఫోన్ పట్టుకున్న దేవా కట్ట కెరీర్ మొత్తం కూడా కల్ట్ క్లాసిక్ సినిమాలనే డైరెక్ట్ చేసాడు.
2005 నుంచి నేటి వరకు అతడి తీసింది కేవలం ఆరు సినిమాలు మాత్రమే.
"""/" /
మొట్ట మొదటి సారి తీసిన వెన్నల సినిమా ద్వారా చాల మంది కొత్త నటులు ఇండస్ట్రీ కి పరిచయం కాగా ఈ సినిమాను ఇంటి పేరుగా మార్చుకున్నాడు వెన్నెల కిషోర్.
ఈ సినిమా ద్వారానే పార్వతి మెల్టన్ కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
ఇక ఈ సినిమా తర్వాత దేవా కట్ట తీసిన మరొక అద్భుతమైన క్లాసిక్ సినిమా ప్రస్థానం.
( Prasthanam Movie ) ఈ సినిమా అతడికి మంచి పేరు తీసుకురావడం మాత్రమే కాదు దేవా కట్ట ను తెలుగు వారంతా గుర్తించేలా చేసింది.
ఈ సినిమా ఆ దశాబ్దపు ఉత్తమ చిత్రంగా నిలబడింది.ఇక ఈ సినిమాను హిందీ లో కూడా రీమేక్ చేసాడు.
ఇక దేవా కట్ట దర్శకత్వం లో వచ్చిన మరిన్ని సినిమాలు ఆటో నగర్ సూర్య మరియు రిపబ్లిక్.
"""/" /
ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయిన స్టోరీ లైన్ చాల బాగుంటుంది.
ఇక దేవా కట్ట నుంచి చాల రోజులుగా ఎలాంటి సినిమాలు రావడం లేదు.
బాహుబలి చిత్రానికి సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పని చేసాడు దేవా కట్ట.
ఇంద్ర ప్రస్థానం అనే మరొక సినిమాను తీసిన అది పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే చాల రోజులుగా పెండింగ్ లో ఉంది.
ఆ తర్వాత మరొక సినిమా షూటింగ్ కూడా అతి త్వరలో మొదలవుతుంది అనే సమాచారం ఉన్నప్పటికీ అఫీషియల్ గా మాత్రం ఎలాంటి న్యూస్ లేదు.
దేవా కట్ట లాంటి గొప్ప దర్శకుడు తెలుగు లో కాకుండా తమిళ్ లేదా మలయాళం లో ఉండి ఉంటే ఇంకా మంచి పేరు వచ్చి ఉండేది.
వావ్.. ఇది కదా అసలైన రోహిత్ శర్మ.. హృదయాలను గెలుచుకున్నాడుగా