మీట్ క్యూట్ రివ్యూ: సిరీస్ ఎలా ఉందంటే?
TeluguStop.com
నాని సోదరి దీప్తి దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ మీట్ క్యూట్.ఇందులో అదా శర్మ, రుహాని శర్మ, వర్ష బొల్లమ్మ, సత్యరాజ్, రాజ్ చెంబోలు, రోహిణి, ఆకాంక్ష సింగ్, అశ్విని కుమార్ లక్ష్మీ కాంతన్, శివ కందుకూరి, సునయన తదితరులు నటించారు.
ఇక ఈ సిరీస్ కు నాని, ప్రశాంతి త్రిపర్నేని నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.
వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ గా బాధ్యతలు చేపట్టాడు.విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు.
అయితే ఈ సిరీస్ తాజాగా సోనీ లీవ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.
H3 Class=subheader-styleకథ:/h3p కథ విషయానికి వస్తే.ఈ వెబ్ సిరీస్ 5 కథల కలయికతో రూపొందింది.
ఇందులో వర్షబొల్లమ్మ స్వాతి పాత్రలో నటించగా ఈమె తన పెళ్లి చూపుల కోసం తన తల్లి చెప్పింది అని అభి (అశ్విన్ కుమార్ లక్ష్మీకాంతన్) ను కలుస్తుంది.
ఆ తర్వాత వారిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.ఇక మధ్యలో అది కావాలనే మ్యాట్రిమోనీ సైట్ లో వివరాలన్నీ తప్పు పెట్టాను అని అంటాడు.
ఇక అభి ఎందుకు అబద్ధం చెప్పాడు.స్వాతి ఎలా రియాక్ట్ అవుతుంది.
అబద్ధం చెప్పినందుకు అతనిని శిక్షిస్తుందా.అనేది తొలి ఎపిసోడ్ లోనిది.
సరోజ (రుహాని శర్మ), మోహన్ రావు (సత్యరాజ్ ) లు వీసా ఆఫీసులో కలవటంతో తనకు సహాయం చేసిన మోహన్ రావుకు తన కాపురం లో వచ్చిన కష్టాలు గురించి చెబుతుంది.
అలా ఆయన సరోజకు ఎటువంటి సలహాలు.ఇస్తాడు అనేది మరో ఎపిసోడ్.
భర్తకు దూరంగా ఉంటున్న పూజ (ఆకాంక్ష సింగ్) ఆర్కిటెక్ట్ గా పనిచేస్తుంది.ఇక ఈమె సిద్దు (దీక్షిత్ శెట్టి) అనే యువకుడికి పరిచయం అవుతుంది.
అయితే వీరి వ్యవహారం తెలుసుకున్న సిద్దు తల్లి పద్మ (రోహిణి) ఏం చేసింది అనేది మరో ఎపిసోడ్.
"""/"/
అమన్ (శివ కందుకూరి) అనే ఓ వైద్యుడు రాత్రి సమయంలో తన కారులో శాలిని (అదా శర్మ) అనే హీరోయిన్ కు కారులో లిఫ్ట్ ఇచ్చి తన ఇంటికి తీసుకెళ్తాడు.
ఇక ఆమెకు తన గురించి చెబుతూ ఉంటాడు.ఆమె యాక్టర్ అని అతనికి తెలియదు.
ఇతడు ఆమె యాక్టర్ అని తెలుసుకుంటాడా లేదా అనేది మరో ఎపిసోడ్.అజయ్ ( గోవింద్ పద్మసూర్య) కు కిరణ్ (సునైన) కు మధ్య బ్రేకప్ జరుగుతుంది.
అయితే అజయ్ మరో అమ్మాయి అంజన (సంచిత) తో రిలేషన్ షిప్ లో ఉండగా అంజనను కిరణ్ కలిసి ఏం మాట్లాడింది అనేది మరో ఎపిసోడ్.
H3 Class=subheader-styleనటినటుల నటన:/h3p నటీనటుల విషయానికి వస్తే సత్యరాజ్, రోహిణి సీనియర్స్ కావటంతో వారు తమ పాత్రలో మునిగిపోయారు.
ఇక అదాశర్మ, ఆకాంక్ష సింగ్, వర్ష, రుహాని, సునైనా బాగా నటించారు.ఇక మిగతా నటీనటులంతా కొంత వరకు పర్వాలేదు అన్నట్లుగా నటించారు.
H3 Class=subheader-styleటెక్నికల్:/h3p టెక్నికల్ పరంగా డైరెక్టర్ మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
విజయ్ అందించిన మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ కూడా పరవాలేదు.
మిగిలిన నిర్మాణ విభాగాలు బాగానే చేశాయి. """/"/
H3 Class=subheader-styleవిశ్లేషణ:/h3p డైరెక్టర్ మంచి కాన్సెప్ట్ తో దానికి మరొకటి సంబంధం లేకుండా అయిదు కథలను అద్భుతంగా చూపించగా.
ఆ అయిదు కథలల్లోని ఒక్కొక్కరి మధ్య జరిగిన సంఘటనలను అద్భుతంగా చూపించారు.కానీ కొన్ని కొన్ని సన్నివేశాలలో బలం అనేది లేకుండా పోయింది.
H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్:/h3p కథ, డైలాగ్స్, కామెడీ, సాంగ్స్
H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపించాయి, కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసినట్లు అనిపించాయి.
H3 Class=subheader-styleబాటమ్ లైన్: /h3pచివరిగా చెప్పాల్సిందేంటంటే కొన్ని ఎపిసోడ్లు మాత్రం చూసినట్లు అనిపించగా మరికొన్ని ఎపిసోడ్లు క్యూట్ అన్నట్టుగా అనిపించాయి.
H3 Class=subheader-styleరేటింగ్: 2/5/h3p.
అల్లు అర్జున్ అరెస్ట్ కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ రెడ్డి.. భార్యను ఓదార్చిన బన్నీ!