జక్కన్న రాసి ఇచ్చిన లెటర్ ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్.. ఆ లేఖలో ఏముందంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న ఏకైక టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి అని మాత్రమే చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

రాజమౌళి నుంచి ఏదైనా ప్రశంస లభిస్తే ఆ ప్రశంస పొందిన వాళ్లకు కలిగే ఆనందం అంతాఇంతా కాదు.

టెక్నాలజీ విషయంలో సైతం రాజమౌళి ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటారు. """/" / స్టార్ డైరెక్టర్ రాజమౌళి రాసి ఇచ్చిన లెటర్ ను దర్శకుడు చందూ మొండేటి ( Chandoo Mondeti )ఫ్రేమ్ కట్టించుకున్నారట.

ఒక సందర్భంలో చందూ మొండేటి చెప్పిన ఈ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కార్తికేయ సినిమా టీజర్ రిలీజ్ తర్వాత రాజమౌళి గారు టీజర్ నచ్చిందని సోషల్ మీడియాలో షేర్ చేశారని చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో సినిమా హిట్టైన దాని కంటే ఎక్కువ సంతోషం లభించిందని చందూ మొండేటి తెలిపారు.

"""/" / కార్తికేయ మూవీ టీజర్, ట్రైలర్, నా పనితనాన్ని మెచ్చుకుంటూ జక్కన్న ఒక లెటర్ రాసి ఇచ్చారని ఆ లెటర్ కు ఫ్రేమ్ చేయించి ఇంట్లో పెట్టానని చందూ మొండేటి వెల్లడించారు.

సినిమా విడుదలకు ముందే జక్కన్నను ఇంప్రెస్ చేయడం సంతోషాన్ని కలిగించిందని ఆయన అన్నారు.

రాజమౌళి ఇప్పటికీ టీజర్, ట్రైలర్ నచ్చితే తన అభిప్రాయాన్ని పంచుకుంటారని చందూ మొండేటి తెలిపారు.

చందూ మొండేటి ప్రస్తుతం తండేల్ సినిమా( Thandel )తో బిజీగా ఉండగా రాజమౌళి మహేష్ సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ రెండు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.చందూ మొండేటి టాలీవుడ్ టైర్1 హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తుండగా ఆ ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.

రాజమౌళి గ్రేట్ అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

తమిళంలో గేమ్ ఛేంజర్ హిట్టవ్వడం సాధ్యమేనా.. అక్కడ ఏం జరుగుతుందో?