రెండో సినిమాకే భారీగా డిమాండ్ చేస్తున్న బుచ్చిబాబు.. ఏకంగా అన్ని కోట్లా?

సుకుమార్ శిష్యుడుగా ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు డైరెక్టర్ బుచ్చిబాబు.

ఈయన దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఉప్పెన.

ఈ సినిమా గత ఏడాది మొదట్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.ఈ సినిమా హిట్ అయినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమా దర్శకుడికి ఇప్పటివరకు ఏ హీరోతోను సినిమా చేసే అవకాశం రాలేదు.

ఉప్పెన తరువాత బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇక బుచ్చిబాబు ఎన్టీఆర్ సినిమా కాకుండా ఇతనికి తన రెండవ సినిమా కూడా మెగా హీరోతో చేసే అవకాశం వచ్చింది.

ఈ విధంగా బుచ్చిబాబుకు మెగా హీరో రామ్ చరణ్ తో అవకాశం వచ్చింది.

ఇక ఈ విషయాన్ని అధికారకంగా కూడా ప్రకటించారు.ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులలో బుచ్చిబాబు ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఓ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రామ్ చరణ్ సినిమా కోసం బుచ్చి బాబు భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

"""/" / సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బుచ్చిబాబు ఈ సినిమా కోసం ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

ఇలా రెండో సినిమాకే బుచ్చిబాబు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే బుచ్చిబాబు రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని చెప్పాలి.

ఇక ఇప్పటికే నిర్మాతలు అడ్వాన్స్ ఇవ్వడంతో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారని సమాచారం.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా పూర్తి అయిన అనంతరం రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాతో బిజీ కానున్నారు.