కథ విషయంలో చిరంజీవి గెలుకుతూనే ఉంటారు.. డైరెక్టర్ బాబీ సంచలన వ్యాఖ్యలు?

సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటుడు చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.

ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చి తన స్వశక్తితో తన టాలెంట్ తో అవకాశాలను అందుకొని ప్రేక్షకులను మెప్పించిన చిరు ఎంతోమంది కొత్తవారికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పాలి.

ఇలా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్న వారు ఉన్నారు.

"""/" / ఇక ఇటీవల కాలంలో చిరంజీవి యువ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలకు కమిట్ అవుతూ ఉన్నారు.

ఇక ఈయన చివరిగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమాకు డైరెక్టర్గా బాబీ ( Boby ) వ్యవహరించిన సంగతి తెలిసిందే.

చిరంజీవితో హిట్ కొట్టిన బాబీ బాలకృష్ణ( Balakrishna ) తో డాకు మహారాజ్ ( Daku Maharaj )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

"""/" / ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ లాంచ్ చేశారు.

ఈ టీజర్ లంచ్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ బాబీకి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

ఇలా చిరంజీవితో బాలకృష్ణతో సినిమా చేసిన ఈయన ఆ ఇద్దరికి హీరోల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

చిరంజీవి గారికి ఒకసారి కథ చెప్పిన తర్వాత మరీ మరీ కథ గురించి అడుగుతూనే ఉంటారు.

అలాగే డైలాగ్ పేపర్స్ కూడా ముందుగానే ఇవ్వాలని చెబుతుంటారు.ఇలా ఆయన ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో శ్రద్ధ చూపుతారని తెలిపారు.

ఇక బాలయ్యకు ఒకసారి కథ చెబితే మరోసారి కథ గురించి అడగరు డైరెక్టర్ ను గుడ్డిగా నమ్మేస్తారు.

సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్లు ఏం చెప్పినా అది చేసేస్తారు అంటూ ఇద్దరి గురించి తెలిపారు.

ఈ క్రమంలోనే చిరంజీవి యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంపై భారీగా విమర్శలు చేస్తున్నారు.

చిరంజీవి తరచూ కథలో వేలు పెడుతూనే ఉంటారని అందుకే ఆచార్య అలాంటి రిజల్ట్ అందుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆ హీరో నో చెప్పడం బాధించింది.. వైరల్ అవుతున్న గౌతమ్ మీనన్ కామెంట్స్!