B Gopal : ఈ డైరెక్టర్ బాలీవుడ్ లో కూడా సినిమాలు తీసాడని మీకు తెలుసా ?

దర్శకుడు బి.గోపాల్( B.

Gopal ) గురించి పరిచయం చేయాలిసిన అవసరం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో జన్మించిన ఆయన సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.

బాలకృష్ణతో చేసిన సమరసింహారెడ్డి సినిమాకి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు మరియు ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు.

రక్త తిలకం, బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్ వంటి మాస్ సినిమాలను కూడా తీసి అదిరిపోయే విజయాలను సాధించారు.

గోపీచంద్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సినిమా ఆరడుగుల బుల్లెట్‌కి ఆయన దర్శకత్వం వహించారు.

తెలుగులోనే కాదు హిందీలో కూడా రెండు సినిమాలు చేసారు.ఇక్కడ విషయం ఏంటంటే ఆ రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలు కావడం విశేషం.

"""/" / H3 Class=subheader-styleఇన్సాఫ్ కి ఆవాజ్:/h3p హిందీలో గోపాల్ డైరెక్ట్ చేసిన తొలి చిత్రమిది.

తెలుగులో ఆయన మొదట డైరెక్ట్ చేసిన ప్రతిధ్వని సినిమాని హిందీలో కూడా తీశారు.

ఈ సినిమాలో రేఖ, అనిల్ కపూర్, రిచా శర్మ( Anil Kapoor ) ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమా 1986 నవంబర్ 12న రిలీజైంది.అంతేకాదు తెలుగులో విజయం సాధించిన ఈ సినిమా హిందీలోనూ భారీ విజయాన్ని సాధించింది.

ప్రతిధ్వని గోపాల్ మొదటి సినిమా కాగా ఇన్సాఫ్ కి ఆవాజ్ సినిమా గోపాల్ ఫిల్మోగ్రఫీలో రెండో చిత్రం.

ఈ సినిమాతో గోపాల్ కి మరింత గుర్తింపు వచ్చింది. """/" / ఇక గోపాల్ హిందీలో చేసిన రెండో సినిమా కానూన్ అప్నా అప్నా( Kanoon Apna Apna ).

ఈ సినిమా కూడా గోపాల్ డైరెక్ట్ చేసిన కలెక్టర్ గారి అబ్బాయి సినిమాకి హిందీ వెర్షన్.

తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, శారద, రజిని నటించిన ఈ సినిమాలో హిందీలో దిలీప్ కుమార్, నూతన్, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ ముఖ్య పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించారు.

ఈ సినిమాకి 'కానూన్ అప్నా అప్నా అనే టైటిల్ ని పెట్టారు.ఈ సినిమా కూడా రీమేక్.

ఈ సినిమా థియేటర్ లలో 1989 అక్టోబర్ 27న విడుదలైంది.ఇలా తెలుగులో మాస్ సినిమాలతో ఎంటర్ టైన్ చేసిన గోపాల్ హిందీలో కూడా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

హనుమాన్ రికార్డ్ ను క్రాస్ చేసే సినిమా ఏది.. సంక్రాంతికి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?