Aarthi Agarwal : ఆర్తి అగర్వాల్ చివరి మాటలను మీడియాతో పంచుకున్న అమ్మ రాజశేఖర్.. ఏమైందంటే?

టాలీవుడ్ దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్( Aarthi Agarwal ) గురించి మనందరికీ తెలిసిందే.

ఈమె భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆమె జ్ఞాపకాలు ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.

అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోల సరసన నటించి తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఆర్తి అగర్వాల్.

వెంకటేష్, సునీల్, తరుణ్, ఉదయ్ కిరణ్,చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల సరసన నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఆర్తి అగర్వాల్.

ఆమె అభిమానులు ఇప్పటికీ ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. """/" / ఇకపోతే ఆమె అతి చిన్న వయసులోనే ఊహించని విధంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

తాజాగా ఆమె గురించి నటుడు డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ స్పందించారు.చివరి రోజుల్లో ఆర్తి అగర్వాల్( Aarthi Agarwal ) తనతో మాట్లాడిన మాటల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కానీ 2006 నుండి వ్యక్తిగత కారణాలతో డౌన్ ఫాల్ ప్రారంభమై సినిమాలకు దూరమయ్యారు.

2007 లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లాడి 2009 లో విడాకులు తీసుకున్నారు.

2015 లో లైపోసక్షన్ సర్జరీ చేయించుకున్న ఆరువారాల తర్వాత శ్వాస సంబంధ సమస్యతో 31 సంవత్సరాల వయసులో కన్నుమూసారు ఆర్తి అగర్వాల్.

తాజాగా ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో తనతో మాట్లాడిన మాటలను డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ ( Amma Rajasekhar )మీడియాతో పంచుకున్నారు.

"""/" / అమ్మ రాజశేఖర్( Aarthi Agarwal ) 2015 లో డైరెక్ట్ చేసిన రణం 2 సినిమా( Ranam 2 )లో ఆర్తి అగర్వాల్ నటించారు.

నటుడు శ్రీహరికి అనారోగ్య కారణాలతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిందట.

ఆ సమయంలో 6 నెలల గ్యాప్ తర్వాత షూటింగ్‌కి వచ్చిన ఆర్తి అగర్వాల్‌ని చూసి షాకయ్యానని చెప్పారు అమ్మ రాజశేఖర్.

విపరీతంగా వెయిట్ గెయిన్ అయిన ఆర్తి అగర్వాల్ కాస్ట్యూమ్ సెట్ కాలేదని బాగా ఏడ్చేసారట.

తను ఇంక బయటకు రాలేనని ఆవేదనతో చెప్పారని అమ్మ రాజశేఖర్ చెప్పారు.అదే సంవత్సరం బరువు తగ్గడం కోసం చేయించుకున్న లైపోసక్షన్ సర్జరీ ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.

చిన్న వయసులోనే ఆర్తి కన్నుమూశారు.

రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించిన ప్రముఖ నటీనటులు వీళ్లే!