ఆర్తి అగర్వాల్ మరణానికి అదే కారణం… ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
TeluguStop.com
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో దివంగత నటి ఆర్తి అగర్వాల్( Aarthi Agarwal ) ఒకరు.
ఈమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఇండస్ట్రీలో ఎంత తొందరగా అయితే సక్సెస్ అందుకున్నారు అంత తొందరగా ఈమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని చెప్పాలి.
ఆర్తి అగర్వాల్ మరణాన్ని ఇప్పటికీ కూడా ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. """/" /
ఆర్తి అగర్వాల్ మరణించడానికి గల కారణం ఆమె సన్నబడటానికి చేయించుకున్న సర్జరీ అని, లేదు ఆమె ప్రేమించిన వ్యక్తికి దూరం కావటం వల్లే డిప్రెషన్ లోకి వెళ్లిపోయి మరణించారు అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి అయితే తాజాగా ప్రముఖ నటుడు డైరెక్టర్ అమ్మ రాజశేఖర్( Amma Rajasekhar ) ఒక కార్యక్రమంలో భాగంగా ఆర్తి అగర్వాల్ మరణం గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ ఆర్తి అగర్వాల్ చనిపోవటానికి ఆమె మానసిక పరిస్థితి( Mental Health Issues ) కారణమని తెలియజేశారు.
"""/" /
అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో రణం 2( Ranam 2 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమాలో హీరోగా శ్రీహరి నటించాల్సి ఉంది ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా ఆరు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది అయితే ఈ ఆరు నెలల తర్వాత షూటింగ్ సెట్లోకి ఆర్తి అగర్వాల్ రావడంతో ఆమెను చూసి ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను.
ఆమె ఊహించని విధంగా శరీర బరువు పెరిగిపోయారు.షూటింగ్ సెట్లోకి వచ్చిన ఆమెకు కాస్ట్యూమ్స్ సరిపోకపోవడంతో ఒక్కసారిగా ఏడ్చేసారని అమ్మ రాజశేఖర్ తెలిపారు.
"""/" /
అధిక శరీర బరువు పెరిగిపోవటం వల్ల తాను ఇకపై బయటికి రాలేనని తను ఇండస్ట్రీకి కూడా దూరం కావాల్సి వస్తుంది అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారనీ తెలిపారు.
ఇలా అధిక శరీర బరువు ఉన్న ఆమె శరీర బరువు తగ్గించుకోవాలని సర్జరీ చేయించుకున్నారు.
ఆ లైపోసక్షన్ సర్జరీ ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.ఆమె ప్రేమ, సూసైడ్ విషయంలో చాలా బ్యాడ్ అయ్యారు.
తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఎంతో మానసికంగా కృంగిపోయారు.
ఈ విషయాలన్నీ తన మరణానికి కారణం అయ్యాయి అంటూ అమ్మ రాజశేఖర్ మాస్టర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.