సముద్రఖని ఆఫీస్ లో దొంగతనం.. ఏ వస్తువో తెలిస్తే పగలబడి నవ్వుతారు!

తెలుగు సినీ ప్రేక్షకులకు ఉన్నటుడు సముద్రఖని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సముద్రఖని.

ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.రఘువరన్ బీటెక్ లాంటి సినిమాతో తెలుగువాళ్లకు పరిచయమయ్యారు.

ఇటీవల విడుదల అయినా భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్, సర్కారువారి పాట, గాడ్ ఫాదర్ లాంటి చిత్రాల్లోనూ కీలకపాత్రల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం కోలీవుడ్ తో పోల్చుకుంటే టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు సముద్రఖని.

ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాలలో సముద్రఖని చిన్నపాత్రలో అయినా సరే తప్పకుండా కనిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో సముద్రఖనికి సంబంధించిన వార్త ఒకటి తెగ వైరల్ అవుతోంది.

"""/" / అదేమిటంటే సముద్రఖని ఆఫీసులో తాజాగా ఒక దొంగతనం జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళితే.

చెన్నైలోని మధురవాయిల్ లో సముద్రఖనికి ఒక ఆఫీస్ ఉంది.అయితే తాజాగా ఆ ఆఫీస్ దగ్గరికి వచ్చిన ఒక అపరిచితురాలు.

కారు పై ఆరేసిన రెయిన్ కోట్స్ దొంగిలించింది.ఈ మేరకు ఆఫీస్ మేనేజర్ కార్తీక్ స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు,ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించారు.అందులో ఓ మహిళ ఆఫీస్ లో చొరబడి, అక్కడ కారుపై ఆరబెట్టిన రెయిన్ కోట్స్ తీసుకుని, వాటిని వేసుకుని కారుపై కాసేపు పడుకుని వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి.

ఈ విచిత్రమైన దొంగతనాన్ని చూసి నెటిజన్స్ కూడా అవాక్కవుతున్నారు.అయితే ప్రస్తుతం ఆ మహిళను వెతికిలే పనిలో పడ్డారు పోలీసులు.