జిల్లా సమగ్ర అభివృద్ధికి “దిశ” నిధులు:ఎంపీ బడుగుల

యాదాద్రి జిల్లా:వివిధ పథకాల కింద జిల్లాకు మంజూరైన కేంద్ర ప్రభుత్వ నిధులు సమర్థవంతంగా సద్వినియోగ పరుచుకోవాలని రాజ్యసభ ఎంపీ,దిశ కో-చైర్మన్ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన యాదాద్రి భువనగిరి జిల్లా సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేశారని కొనియాడారు.

జిల్లా అభివృద్ధికి సాధ్యమైనన్ని నిధులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

జిల్లాను రోల్ మోడల్ తీర్చి దిద్దాలని అధికారులకు సూచించారు.ఐసిడిఎస్ పథకము ద్వారా అంగన్వాడి కేంద్రాల పిల్లలు,గర్భిణులకందించే పౌష్టికాహారం నాణ్యతతో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.

ఆత్మనిర్బర్ అభియాన్ కింద వ్యవసాయ మత్స్య,పాడి పరిశ్రమ తదితర రంగాలకు విస్తృతంగా రుణాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాకు పెద్ద మొత్తంలో ప్రైవేట్ పరిశ్రమలు వస్తున్నందున నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్యతపై శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పసల్ బీమా యోజన కింద పంటనష్టం జరిగినప్పుడు రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని అన్నారు.

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని,దీనిపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని కోరారు.ఈ సమావేశంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత,యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,డిఆర్డిఎ పిడి ఉపేందర్ రెడ్డి,అన్ని శాఖల అధికారులతో సహా పలు మండలాల జీడీపీటీసీలు,ఎంపీపీలు,ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేగా బాలయ్య ప్రమాణ స్వీకారం…ఎమోషనల్ పోస్ట్ చేసిన బ్రాహ్మిణి!