హైదరాబాద్ నుండి విమానాలు డైరెక్టుగా విదేశాలకే… ఫ్రాంక్‌ఫర్ట్ డైరెక్ట్ ఫ్లైట్ ఎప్పుడంటే?
TeluguStop.com
అవును, గత కొన్నాళ్లుగా మన హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు( Rajiv Gandhi International Airport ) నుంచి నేరుగా వివిధ దేశాలకు విమానాల రాకపోకలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోనే కొత్తగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ సిటీకి,( Frankfurt ) హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా విమానాలు నడవనున్నాయనే విషయం తెలుస్తోంది.
ఈ మేరకు ఈ విమాన రాకపోకలకు సంబంధించి ఎయిపోర్టు అధికారులు సర్వం సిద్ధం చేసినట్టు సమాచారం.
కాగా లుఫ్తాన్సా విమానం( Lufthansa ) ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు కొనసాగించనుంది.
"""/" /
ఈ మార్గంలో తొలి విమానం 2024, జనవరి 16వ తేదీన అంటే ఈరోజున ప్రారంభం కానుంది.
ఈ విమానంలో 26 బిజినెస్ క్లాస్ సీట్లు, 21 ప్రీమియం ఎకానమీ సీట్లు, 247 ఎకానమీ క్లాస్ సీట్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.
ఈ మేరకు విమానం బయలు దేరిన సమయం వివరాలు ఉంచారు.తొలి విమానం ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి జనవరి 16న ఉదయం 10 గంటలకు బయల్దేరి, హైదరాబాద్‌కు రాత్రి 11 గంటలకు చేరుకోనుంది.
"""/" /
ఆ తరువాత మళ్లీ హైదరాబాద్ నుంచి మరుసటి రోజు తెల్లవారు ఝామున ఒంటి గంటకు బయల్దేరి, ఉదయం 6:10 గంటలకు అక్కడికి చేరుకోనుంది.
అంటే ఫ్రాంక్‌ఫర్ట్ నుండి హైదరాబాద్ మధ్య 8 గంటల 30 నిమిషాల పాటు ప్రయాణం కొనసాగానున్నట్టు తెలుస్తోంది.
ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు మంగళ, శుక్ర, ఆదివారాల్లో విమానాలు అందుబాటులో ఉండగా, హైదరాబాద్ నుంచి సోమ, బుధ, శనివారాల్లో అందుబాటులో ఉండనున్నాయని సమాచారం.
యూఏఈలోని ఎన్ఆర్ఐలకు అలర్ట్ .. పాస్‌పోర్ట్ రెన్యూవల్ గైడ్‌లైన్స్ చూశారా?