భార్యలపై కామెంట్స్ చేసిన దినేష్ కార్తిక్ చివరకు..?!

క్రికెట్ ప్రపంచంలో దినేష్ కార్తీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తాజాగా దినేష్ కార్తీక్ క్రికెట్ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

మొదటిలో తనదైన వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు కామెంట్రీ పెద్దలు కూడా మెచ్చుకున్నారు.

దీంతో ఒక్కసారిగా దినేష్ కార్తీక్ జోష్ ను పెంచేశాడు.ఇది ఇలా ఉండగా తాజాగా శ్రీలంక - ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో భాగంగా కామెంట్రీ తెలుపుతూ చేసిన వాక్యాలతో ఒక్కసారిగా బొక్క బోర్లా పడ్డాడు దినేష్ కార్తీక్.

వాస్తవానికి జోక్ చెబుతున్నాను అని అనుకున్నాడు.కానీ అది మహిళలపై అవ్వడంతో ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది.

దీంతో సోషల్ మీడియాలో దినేష్ కార్తీక్ నెటిజన్స్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.కామెంట్రీలో భాగంగా బ్యాట్స్మెన్ కు బ్యాట్ కు మధ్య ఉన్న రిలేషన్ గురించి తనదైన రీతిలో వాఖ్యానం జోడిస్తూ చాలా మంది బ్యాట్స్మెన్లు తమ బ్యాట్లను ఇష్టపడినట్టు కనిపించరు.

వాళ్లు ఇతర ఆటగాళ్ల బ్యాట్లను ఇష్టపడుతుంటారు.ఆ బ్యాట్లు చుట్టుపక్కల ఉండే ఇతరుల భార్యల్లాంటివిదినేష్ కార్తీక్ అని అన్నారు.

దీంతో దినేష్ కార్తీక్ ఒక్కసారిగా అడ్డంగా బుక్ అయిపోయాడు ఇతరుల భార్యల పట్ల ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసిన దినేష్ కార్తీక్ నెటిజన్స్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురి అవడంతో పాటు క్షమాపణలు చెప్పాలని కోరారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/07/bats-neighbour’s-wife’-comments-viral-social-meida-netizens-fire-comentary!--jpg "/ కామెంట్రీ పేరుతో ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడటం మంచిది కాదు అంటూ నెటిజన్స్ మండిపడ్డారు.

అంతేకాకుండా దినేష్ కార్తీక్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ నీ పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాన్ని కామెంటరీలో చెప్పావా? కామెంట్ చేయడం గమనార్హం.

మరికొంతమంది నెటిజన్స్ మహిళలపై గౌరవం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.చివరికి ఈ విషయంపై దినేష్ కార్తీక్ స్పందిస్తూ మహిళలపై తప్పుడు ఉద్దేశంతో అసలు కాదు అని, తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు తెలియజేస్తానని దినేష్ కార్తీక్ తెలిపారు.

ఉల్లితో చర్మానికి మెరుగులు.. ఇలా వాడితే ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు!