కేసు సరే… డింపుల్ హయాతి కెరీర్ పరిస్థితి ఏంటి పాపం!
TeluguStop.com
హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే గుర్తింపు దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ డింపుల్ హయాతి( Dimple Hayathi ).
కెరీర్ ఆరంభంలో కలర్ గురించి కొందరు కామెంట్స్ చేస్తూ ఆమెను విమర్శలు చేసిన విషయం తెల్సిందే.
అలాంటి పరిస్థితి నుండి హీరోయిన్ గా ఎదిగిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అనడంలో సందేహం లేదు.
డింపుల్ హయాతి ఇటీవలే రామబాణం( Ramabanam ) అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
ఆ సినిమా యొక్క ఫలితం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇప్పుడు డింపుల్ హయతి యొక్క కెరీర్ గురించి ఆందోళనతో ఉన్న సమయంలో డీసీపీ( DCP Rahul Hegde ) తో గొడవ.
జూబ్లీ హిల్స్ లో పోలీస్ కేసు వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముందు ముందు ముద్దుగుమ్మ యొక్క అవకాశాలు దెబ్బ తింటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
"""/" /
మొత్తానికి డింపుల్ యొక్క కెరీర్ విషయంలో ఈ కేసు చాలా ప్రభావం చూపిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు డింపుల్ హయాతి ఈ కేసు విషయంలో స్పందిస్తూ తనను వేదించేందుకు ప్రయత్నించారని.
తాను కోపంలో అక్కడ ఉన్న ట్రాఫిక్ కోన్ ను రాయితో తన్నినాను. """/" /
అంతే తప్ప తాను గొడవ పడాలని అనుకోలేదు అంటూ డింపుల్ హయాతి పేర్కొంది.
ముందు ముందు డింపుల్ హయాతికి అవకాశాలు రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఈ వివాదం వల్ల డింపుల్ యొక్క క్రేజ్ బాగా పెరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి డింపుల్ హయతి యొక్క హడావుడి కారణంగా వార్తల్లో నిలిచింది అనే విషయం వాస్తవం.
ఆ కేసు ఎక్కడకు దారి తీస్తుంది.ఆ తర్వాత పరిణామాలు ఏంటి అనేది చూడాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
యాక్టింగ్ వదిలేయాలనుకుంటే భార్య మాటలే నిలబెట్టాయి.. శివ కార్తికేయన్ కామెంట్స్ వైరల్!