Dimple Hayathi: డింపుల్‌పై కావాలనే తప్పుడు కేసు పెట్టారన్న లాయర్.. అసలేం జరిగిందంటే?

ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే,( DCP Rahul Hegde ) హీరోయిన్ డింపుల్ హయతిల( Dimple Hayathi ) వివాదం హాట్ టాపిక్ గా మారింది.

కాగా ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్న రాహుల్ హెగ్డే, డింపుల్ హయతి ఉంటున్న గత కొద్దిరోజులుగా కారు పార్కింగ్ ప్లేస్( Car Parking ) విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

అయితే, పార్క్ చేసి ఉన్న తన రాహుల్ కారును డింపుల్ బీఎండబ్ల్యూ కారుతో ఢీకొట్టారని అంతేకాకుండా కాలితో తన్నారని ఆరోపిస్తూ ఆమెపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రాహుల్ హెగ్డే కారు డ్రైవర్, కానిస్టేబుల్ చేతన్ కుమార్ ఈ కేసు పెట్టారు.

"""/" / అయితే విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పోలీసులు డింపుల్ హయతీ తో పాటు ఆమె స్నేహితుడు విక్టర్ డేవిడ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అక్కడ మూడు గంటలపాటు కూర్చోబెట్టి విసిగించారని డింపుల్ ఆరోపిస్తున్నారు.పోలీసుల తీరుపై తాను కోర్టుకు వెళ్తానని డింపుల్ అంటున్నారు.

కావాలనే తన కారుకు చలాన్లు వేస్తున్నారని డింపుల్ అంటున్నారు.మరోవైపు, ఈ కేసు విచారణకు కోర్టులో హాజరుకావాలని డింపుల్ హయతీకి పోలీసులు 41 సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చారు.

అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజ్‌లో డింపుల్ హయతి కారు డీసీపీ కారు దగ్గరగా వెళ్లి అక్కడ ఉంచిన ట్రాఫిక్ కోన్స్‌ను ఢీకొన్నట్టు కనిపిస్తోంది.

అంతేకాకుండా, ఆ ట్రాఫిక్ కోన్స్‌ను ఆమె కాలితో తన్నడం కూడా కనిపిస్తోంది. """/" / అయితే, ఈ ట్రాఫిక్ కోన్స్ డింపుల్ పార్కింగ్ ప్లేస్‌లోకి రావడంతోనే ఆమె తన్నారని లాయర్ అంటున్నారు.

ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.

పార్కింగ్ విషయంలో తప్పుడు కేసు పెట్టారు.వాళ్లు మీకు చూపిస్తున్న ఆధారాలు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నాయి.

పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.డీసీపీ ఒక ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి రోడ్డు పై ఉన్న సిమెంట్ బ్లాక్స్‌ను పార్కింగ్ ప్లేస్‌లో పెట్టించారు.

ప్రభుత్వానికి చెందిన ఆ సిమెంట్ బ్లాక్స్‌ ను లోపలికి ఎందుకు తీసుకొస్తారు? ఎందుకంటే ఆయన డింపుల్‌ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ అపార్ట్‌మెంట్‌లో కామన్ ఏరియాను బ్లాక్ చేయడానికి వీల్లేదు.కానీ, ఆయన ఉద్దేశపూర్వకంగా వేధించాలనే బ్లాక్ చేశారు.

సుమారు రెండు నెలల నుంచి డింపుల్ ను ఇబ్బంది పెట్టడం, ఆమెతో అమర్యాదగా మాట్లాడటం చేస్తున్నారు.

ఇష్టమొచ్చినట్టు మాట్టాడారు అని లాయర్ చెప్పుకొచ్చారు.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ రేంజ్ లో హిట్ కావడం వెనుక అసలు కారణాలివేనా?