కడప జిల్లాలో కుంగిపోయిన మూడంతస్తుల భవనం
TeluguStop.com
కడప జిల్లాలో ఓ మూడంతస్తుల భవనం ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది.స్థానిక కో ఆపరేటివ్ బ్యాంకు కాలనీలోని విద్యామందిర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బిల్డింగ్ మొదటి, రెండో అంతస్తుల్లో కుటుంబాలు నివాసం ఉంటుండగా.గ్రౌండ్ ఫ్లోర్ లో మరమ్మత్తుల పనులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో అర్ధరాత్రి భవనం నుంచి భారీ శబ్దాలు రావడంతో రెండో అంతస్తులోని వారు బయటకు వచ్చి చూశారు.
అప్పటికే భవనం ఓ వైపుగా కుంగిపోయింది.అయితే తలుపులు తెరుచుకోకపోవడంతో మొదటి అంతస్తులోని వారు లోపలే చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు.ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.