నల్లగొండ జిల్లా: వర్షాకాలం సమీపిస్తున్నందున నల్లగొండ పట్టణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వాటికి మరమ్మత్తులు చేయించుకోవాలని యాజమాన్యాలకు సూచించాలని మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ సూచించారు.
బుధవారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్,వార్డ్ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
వార్డు ఆఫీసర్లు తమ తమ వార్డుల్లో భవనాలను గుర్తించి చిన్న చిన్న రిపేర్లు ఉన్నట్లయితే యాజమాన్యాలు రిపేర్లను చేయించుకునే విధంగా సూచనలు చేయాలని,
కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను తొలగించిలాని సూచించారు.
పట్టణ ప్రజలు కూడా శిథిలావస్థ భవనాలను గుర్తించి మున్సిపల్ అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇలా చేయడం వల్ల ప్రాణ,ఆస్తి నష్టాన్ని నివారించవచ్చన్నారు.ఈ సమావేశంలో ఏసీబీ నాగిరెడ్డి,వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
భారీ గిరినాగుతో దెబ్బకు బిత్తరపోయిన రైతులు.. వైరల్ వీడియో