ఆస్తులు అమ్ముకొని వస్తే అన్నపూర్ణ గేట్ లోకి కూడా వెళ్లలేకపోయా.. నటుడి కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటుడు దిల్ రమేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను కెరీర్ లో అనుభవించిన కష్టాల గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

దిల్ రమేష్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే పేరెంట్స్ ఆలోచనలో మార్పు వచ్చిందని ఆయన అన్నారు.

పిల్లలకు అప్పట్లో 100 రూపాయలు ఇవ్వాలంటే 10 రూపాయలు మాత్రమే ఇచ్చేవారని దిల్ రమేష్ వెల్లడించారు.

పిల్లలకు పేరెంట్స్ నుంచి సపోర్ట్ ప్రస్తుతం ఎక్కువగా ఉందని దిల్ రమేష్ తెలిపారు.

పేరెంట్స్ కూడా పిల్లల నిర్ణయాన్ని గౌరవిస్తున్నారని దిల్ రమేష్ వెల్లడించారు.ప్రయత్నం చేయకుండా కలలు కనడం కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడి స్ట్రగుల్స్ అర్థం చేసుకుని రియలైజ్ కావాలని ఆయన తెలిపారు.

తాను ఆస్తులు అమ్ముకొని వచ్చానని అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వెళితే ఒకరోజంతా కష్టపడినా లోపలికి వెళ్లలేకపోయానని దిల్ రమేష్ కామెంట్లు చేశారు.

షూటింగ్ చూస్తానని చెప్పినా తనకు అనుమతి ఇవ్వలేదని ఆ తర్వాత ఛాంబర్ దగ్గర ట్రై చేశానని దిల్ రమేష్ వెల్లడించారు.

"""/"/ నేను ఆర్టిస్ట్ అవ్వాలని వస్తే నాగినీడు గారు నా క్వాలిఫికేషన్ చూసి జాబ్ ఇవ్వలేదని దిల్ రమేష్ అన్నారు.

సమాజంలో విద్య, వైద్యం ఇప్పుడు వ్యాపారాలు అయ్యాయని దిల్ రమేష్ వెల్లడించారు.నేను స్కూల్ రన్ చేసే సమయంలో సర్వీస్ గా స్కూల్ ను నడిపేవాళ్లమని దిల్ రమేష్ అన్నారు.

"""/"/ డీగ్రేడ్ చేసి మాట్లాడితే ఇంటికి వెళ్లిపోతానని నాగినీడు భావించారని దిల్ రమేష్ వెల్లడించారు.

నిజంగా తనకు వర్క్ రాదని అనిపిస్తే తనను తీసేయండని చెప్పి ఆయన దగ్గర జాయిన్ అయ్యానని దిల్ రమేష్ పేర్కొన్నారు.

1300 రూపాయలు శాలరీ ఇస్తానని చెప్పినా తాను జాయిన్ అయ్యానని దిల్ రమేష్ వెల్లడించారు.

ఇండస్ట్రీలో సక్సెస్ కావడం సులువు కాదని ఆయన తెలిపారు.

యూఎస్ బైకర్లతో ఇండియన్ టూరిస్ట్‌ల ఫ్రెండ్లీ ఇంట్రాక్షన్ వైరల్..