క్షీరలింగేశ్వర స్వామిని దర్శించుకున్న దిల్ రాజు దంపతులు..ఫోటో వైరల్!
TeluguStop.com
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తరచూ సినిమా షూటింగ్ లలో బిజీగా గడుపుతూ క్షణం తీరిక లేకుండా ఉంటారు.
ఇలా వీరికి షూటింగ్ పనులలో కాస్త విరామ సమయం దొరికినప్పుడు కుటుంబంతో కలిసి అలా H3 Class=subheader-styleహాలిడే వెకేషన్/h3p కి వెళ్లడం లేదా దైవదర్శనాలకు వెళ్లడం చేస్తుంటారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆయన సతీమణి తేజస్విని తో కలిసి క్షీర లింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
ఇలా సతీసమేతంగా దిల్ రాజు క్షీర లింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
దిల్ రాజు భార్య తేజస్విని తాజాగా ఒక కుమారుడికి జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.
ఇలా కొడుకు పుట్టిన తర్వాత మొదటిసారి తన భర్తతో కలిసి పాలుకొల్లులోని క్షీర లింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చారు.
రాజమండ్రి పరిసర ప్రాంతాలలోనే శంకర్ రామ్ చరణ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా తన భార్య తేజస్విని కోరిక మేరకు తన భర్త దిల్ రాజుతో కలిసి ఈమె ఆలయానికి వెళ్లారు.
"""/"/
దిల్ రాజు సతీసమేతంగా ఆలయాన్ని చేరుకోగా అక్కడి పండితులు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలను చేశారు.
పూజల అనంతరం దిల్ రాజు దంపతులు వేద పండితుల ఆశీర్వాదం తీసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్నారు.
అదేవిధంగా ఈ దంపతులకు స్వామివారి చిత్రపటాన్ని శేష వస్త్రాలను కూడా పండితులు సమర్పించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక దిల్ రాజు రామ్ చరణ్ శంకర్ సినిమాతో పాటు విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న వారసుడు సినిమాని కూడా నిర్మిస్తున్నారు.
ఛాట్‌జీపీటీపై సంచలన వ్యాఖ్యలు .. అమెరికాలో శవమై తేలిన భారత సంతతి టెక్కీ