గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు భార్య తేజస్విని.. ఏమైందంటే?

టాలీవుడ్ నిర్మాతగా దిల్ రాజు( Dil Raju ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఈయన డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి దిల్ అనే సినిమా ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన పేరు ముందు సినిమా పేరు దిల్ రాజుగా మారిపోయారు.

ఇలా ఈయన వరుస సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నారు.

ఇలా కేవలం టాలీవుడ్ సినిమాలు మాత్రమే నిర్మిస్తున్న దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు నిర్మాతగా మారారు.

ఈయన నిర్మాణ సారథ్యంలో రామ్ చరణ్( Ramcharan ) హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా వచ్చేయేడాది జనవరి 10వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది.

"""/" / ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా మంచి ఆదరణ లభించింది.

ఇలా సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే దిల్ రాజు అనిత అనే మహిళను వివాహం చేసుకున్నారు.

వీరికి హన్షిత అనే కుమార్తె ఉంది.అయితే 2017 వ సంవత్సరంలో దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మరణించారు.

ఇలా భార్య మరణంతో దిల్ రాజు ఒంటరిగా ఉన్నారు. """/" / ఈ క్రమంలోనే తన కుమార్తె తన తండ్రికి రెండో వివాహం చేస్తుంది.

కూతురికి పెళ్లి జరిగి మనవడు మనవరాలు పుట్టినప్పటికి దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోవడంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

ఇక ఈయన వైగా రెడ్డి అలియాస్ తేజస్విని( Tejaswini ) అనే ఎయిర్ హోస్టెస్ ను వివాహం చేసుకున్నారు.

ఈ దంపతులకు 2022వ సంవత్సరంలో కుమారుడు జన్మించారు.ఈ కుర్రాడికి అన్విత్ రెడ్డి అని నామకరణం చేశారు.

ఇక సోషల్ మీడియాలో దిల్ రాజు భార్య కుమారుడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా తేజస్విని మరో శుభవార్తను తెలియజేశారు.ఈమె ఇటీవల లా( Law ) పూర్తి చేసినట్టు తెలిపారు.

ఇదంతా కూడా తన తల్లి వల్లే సాధ్యమైందని ఈమె ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

22 ఏళ్లుగా పాక్‌లో నరకయాతన.. ఒక్క యూట్యూబ్ వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది..?