వకీల్ సాబ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
TeluguStop.com
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది.కాని కరోనా కారణంగా నెల రోజుల షూటింగ్ పెండింగ్ ఉండిపోయింది.
అది పూర్తయితే రిలీజ్ చేయడానికి దిల్ రాజు సిద్ధం అయిపోతారు.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో చిత్ర యూనిట్ నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత లేదు.
సంక్రాంతి పండగకి ఈ సినిమాని రిలీజ్ చేయాలని దిల్ రాజు అనుకుంటున్నారు.అయితే అప్పటికైనా థియేటర్లు ఓపెన్ అవుతాయా లేదా అనేది అనుమానంగానే ఉంది.
అయితే షూటింగ్ లు స్టార్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడంతో ఆ దిశగా ముందు వకీల్ సాబ్ పెండింగ్ షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా ఈ సినిమాపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి.
వకీల్ సాబ్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారని, ఈ సినిమాకి వంద కోట్లు ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.
అయితే దిల్ రాజు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే దానిపై క్లారిటీ లేదు.
ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ పై స్పందించినట్లు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.ఆయన బద్రి సినిమా టైం నుండీ పవన్ కళ్యాణ్ గారి సినిమా నిర్మించాలని దిల్ రాజు కోరిక.
ఇన్నాళ్టికి ఆ కోరిక నెరవేరబోతోంది.ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యమని భారీ ఆఫర్ వచ్చిన సంగతి వాస్తవమే.
కాని తనకి ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచన ఎంత మాత్రం లేదని దిల్ రాజు సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం.
లేట్ అయినా సరే వకీల్ సాబ్ థియేటర్లలోనే చూస్తారు.మీరు కూడా అందుకు ప్రిపేర్ అయ్యి ఉండండి అంటూ దిల్ రాజు చెప్పినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు.
164 అడుగుల లోయలో పడిపోయిన ప్రెగ్నెంట్ టీచర్… చివరికేమైందో తెలిస్తే?