ఒకేసారి మూడింటికి టెండర్ పెట్టిన రాజుగారు!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు దిల్ రాజు.

ఇక ఈ సినిమాను అఫీషియల్‌గా స్టార్ట్ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాతో పాటు మరో రెండు భారీ ప్రాజెక్టులను కూడా ఆయన త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు.

ఈ క్రమంలో దిల్ రాజు ఎలాంటి సినిమాలు నిర్మి్ంచనున్నాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

అయితే దిల్ రాజు పాన్ ఇండియా చిత్రంగా ప్రొడ్యూస్ చేయబోతున్న శంకర్-చరణ్ సినిమా అతి త్వరలో ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.

ఇక ఈ సినిమాతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఓ సినిమా చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాను దసరా నాటికి ప్రారంభించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

అటు ఈ సినిమాతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించే ‘ఐకాన్’ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేయాలన దిల్ రాజు చూస్తున్నాడు.

ఈ సినిమాను గతంలోనే అనౌన్స్ చేసినా ఇంకా పట్టాలెక్కలేదనే విషయం తెలిసిందే.దీంతో దిల్ రాజు తెరకెక్కించే ప్రాజెక్టులపై చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ సినిమాలను దిల్ రాజు ప్రెస్టీజియస్‌గా తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించి, అదే స్థాయిలో రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

మరి దిల్ రాజు ఈ వరుస సినిమాలతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమాలు పట్టాలెక్కి, రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.