ఆ వైసీపీ నేతను గెలిపించండి.. ఆ నేతకు అండగా దిల్ రాజు!
TeluguStop.com
ఏపీలో మరి కొద్ది రోజులలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) జరగబోతున్నటువంటి తరుణంలో అందరి ఆసక్తి ఏపీ ఎన్నికల( AP Politics ) పైనే ఉంది.
అయితే ఎన్నికలలో భాగంగా కొంతమంది సినీ సెలెబ్రిటీలు కూడా రాజకీయ నాయకులకు మద్దతు తెలుపుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు( Dil Raju )సైతం ఓ వైసిపి నాయకుడికి మద్దతు తెలియజేయడమే కాకుండా తనకు ఓట్లు వేసి గెలిపించాలంటూ అందరిని వేడుకున్నారు.
సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న దిల్ రాజు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ ఈసారి ఒంగోలు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి( Balineni Srinivas Reddy ) ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ దిల్ రాజు కోరారు.
"""/"/
ఐదు సార్లు ఒంగోలు నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోసారి కూడా పోటీ చేస్తున్నారు.
ఈసారి కూడా ఆయనని గెలిపించాలని దిల్ రాజు కోరారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వై ఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ప్రభుత్వాలలో మంత్రిగా బాధ్యతలు నెరవేర్చాడు.
ఒంగోలు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సీనియర్ నేతకు ఓటు వేసి గెలిపించండి.
అని వేడుకున్నారు.అంతేకాకుండా బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్ల ఒక డాక్యుమెంటరీ కూడా తాను సిద్ధం చేశానని దానిని ప్రతి ఒక్కరూ చూడాలంటూ దిల్ రాజు ఈ సందర్భంగా తెలియజేశారు.
"""/"/ఇలా వైసిపి నేతకు ఈయన మద్దతు తెలియజేస్తూ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
సినీ ఇండస్ట్రీ( Film Industry )లో నిర్మాతగా సక్సెస్ అయినటువంటి ఈయన రాజకీయాలలోకి కూడా రాబోతున్నారు అంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ రాజకీయాలకు దూరంగా ఉన్న రాజకీయ నాయకులను సపోర్ట్ చేస్తూ ఈయన మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
రీల్ చేసి ఫేమస్ అవుదామనుకున్నాడు.. కానీ, పోలీసులు దెబ్బకు దిమ్మ తిరిగిందిగా