హీరోల రెమ్యూనరేషన్ పై మరోసారి స్పందించిన దిల్ రాజు.. నిర్మాతలేం తక్కువ కాదంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నిర్మాత దిల్ రాజు ఇదివరకు కేవలం సినిమాల విషయంలో మాత్రమే సోషల్ మీడియాలో నిలిచేవారు.

కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కాంట్రవర్సీల విషయంలో దిల్ రాజు సోషల్ మీడియాలో నిలుస్తున్నారు.

అంతేకాకుండా దిల్ రాజు ఏం చేసినా కూడా ప్రస్తుతం వివాదం అవుతోంది.ఇదిలా ఉంటే తాజాగా నిర్మాత దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా కూడా వివాదాలకు కారణం అయ్యింది.

అయితే ఒకప్పుడు నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమాలు హడావిడి లేకుండా సైలెంట్గా బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చి మంచి విజయాలు సాధించేవి.

కానీ ప్రస్తుతం మాత్రం దిల్ రాజు ఏం చేసిన వివాదం అవుతోంది.కాగా వచ్చే ఏడాదికి సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే.

ఈ రెండు సినిమాలతో పాటు దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమాను కూడా విడుదల చేయమన్నారు.

అయితే ఇక్కడే వివాదం ముదురుతోంది.అయితే దిల్ రాజు తన చిత్రాన్ని తాను రిలీజ్ చేసుకుంటే తప్పా అన్ని కూర్చుని మాట్లాడుకుంటాం వివాదం చేయవద్దని అంటున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు హీరోల రెమ్యూనరేషన్ మీ స్పందించిన విషయం తెలిసిందే.

"""/"/ నిర్మాతలే కావాలనే కొందరు హీరోలకి 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అలాగే హీరోలే నిర్మాతలని కమాండ్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.అయితే ఆ అలాంటి ప్రచారం వాస్తవం కాదు అని అన్నారు.

నిర్మాతలు ఏమీ అమాయకులు కాదు.హీరో మార్కెట్, బడ్జెట్ లెక్కలు, వసూళ్లు అన్నీ అంచనా వేసుకునే రెమ్యునరేషన్ ఇస్తారు.

ఊరికే ఇచ్చేయరు అని దిల్ రాజు తెలిసారు.అలాగే నిర్మాతగా రాణించాలి అంటే అగ్ర కులానికి చెందిన వారు అయి ఉండాలి అనే ఆరోపణలపై కూడా దిల్ రాజు థియరీ వినిపించారు.

తాను రెడ్డి అయినప్పటికీ ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి ఏమీ లేదని అన్నారు.జీరో నుంచే పెట్టాను.

అల్లు అరవింద్ గారు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.సురేష్ బాబు గారుఆయన తండ్రి వేసిన బాటలో పయనిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు దిల్ రాజు.

130 ఏళ్ల కెమెరాతో రగ్బీ మ్యాచ్ క్యాప్చర్‌.. అందులో ఏం కనిపించిందో చూసి..?