ఆ రీజన్ వల్లే రెండో పెళ్లి చేసుకున్నా.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రముఖ టాలీవుడ్ స్టార్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు రెండో పెళ్లి గురించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

రెండో పెళ్లి విషయంలో దిల్ రాజు నిర్ణయం రైట్ అని కొంతమంది చెబితే రాంగ్ అని మరి కొందరు చెప్పారు.

తన రెండో పెళ్లి గురించి కొంతమంది విమర్శలు చేసినా దిల్ రాజు ఆ విమర్శలను పట్టించుకోలేదు.

దిల్ రాజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రెండో పెళ్లికి సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

నాకు 47 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో నా భార్య చనిపోయిందని దిల్ రాజు అన్నారు.

పక్కా ఫ్యామిలీ మ్యాన్ అయిన నాకు భార్య చనిపోవడంతో భారీ షాక్ తగిలినట్లు అయిందని దిల్ రాజు పేర్కొన్నారు.

నేను ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం ఇంట్లో ఉండేవాడినని భార్యను కోల్పోయిన తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డానని ఆయన తెలిపారు.

రెండు సంవత్సరాల పాటు ఆ బాధను అనుభవించానని దిల్ రాజు పేర్కొన్నారు.కూతురు అల్లుడు ఇంట్లో ఉన్నా ఆ బాధ అలాగే ఉండటంతో కుటుంబ సభ్యులు నాకు మళ్లీ పెళ్లి చేయాలని అనుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

"""/"/ ఆ సమయంలో వైఘాను పెళ్లి చేసుకున్నానని దిల్ రాజు అన్నారు.

పెళ్లికి ముందు వైఘాతో నాకు పరిచయం లేదని ఆయన కామెంట్లు చేశారు.వైఘతో అన్ని విషయాలు మాట్లాడి చివరకు పెళ్లికి అంగీకరించానని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

"""/"/ నా కొడుకు అన్వయ్ అని పేరు పెట్టానని దిల్ రాజు తెలిపారు.

ప్రస్తుతం సంతోషంగా జీవనం సాగిస్తున్నానని దిల్ రాజు చెప్పుకొచ్చారు.ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఈ ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు.

నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా.. నెటిజన్ కు హీరోయిన్ షాకింగ్ కౌంటర్ వైరల్!