మహేష్‌ ఒత్తిడితో దిల్‌రాజు సరే అన్నాడట..

మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న 'మహర్షి' చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.ఈ నెలలో మహేష్‌ 25వ చిత్రం మహర్షి షూటింగ్‌ పూర్తి కానుంది.

ఏప్రిల్‌లో సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న మహర్షి చిత్రం తర్వాత మహేష్‌బాబుకు సుకుమార్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయాలని భావించాడు.

మైత్రి మూవీస్‌ వారు ఆ మూవీని నిర్మించేందుకు ముందుకు వచ్చింది.కాని కారణం ఏంటో కాని ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.

మైత్రి వారి నుండి దిల్‌రాజు చేతిలోకి మహేష్‌ బాబు డేట్లు వచ్చాయి.దాంతో అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌ బాబుతో సినిమాను నిర్మించేందుకు దిల్‌రాజు సిద్దం అయ్యాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తన 26వ చిత్రాన్ని అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పిన మహేష్‌ బాబు నిర్మాణంలో మాత్రం అనీల్‌ సుంకరను భాగస్వామ్యంగా తీసుకోవాలని సూచించాడట.

గతంలో తనకు మంచి హిట్స్‌ ఇచ్చిన అనీల్‌ సుంకర ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు.

అందుకే మహేష్‌ బాబు ఆయన్ను అనీల్‌ రావిపూడి మూవీలో నిర్మాణ భాగస్వామ్యం ఇచ్చాడట.

అయితే దిల్‌రాజు మాత్రం సోలోగా మహేష్‌ 26వ చిత్రాన్ని నిర్మించాలని భావించాడు.అదే విషయాన్ని మహేష్‌ బాబుతో చెప్పగా అనీల్‌ సుంకర నిర్మాణ భాగస్వామిగా ఉంటేనే అనీల్‌ రావిపూడి మూవీని చేస్తానంటూ ఖరాఖండీగా చెప్పాడట.

దాంతో మహేష్‌ బాబు కోరిక మేరుకు అనీల్‌ సుంకరను ఈ ప్రాజెక్ట్‌లో నిర్మాతగా చేర్చినట్లుగా తెలుస్తోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అనీల్‌ రావిపూడి ఈ చిత్రంకు వాట్సప్‌ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడట.

ఇప్పటికే అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు పటాస్‌, సుప్రీమ్‌, ఎఫ్‌ 2 అంటూ విభిన్నమైన టైటిల్స్‌తో తెరకెక్కాయి.

అలాగే ఈ చిత్రానికి కూడా వాట్సప్‌ అనే టైటిల్‌ ఉంటే బాగుంటుందని భావించారట.

అందుకే ఈ చిత్రానికి వాట్సప్‌ టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించారు.ఏప్రిల్‌లో ఈ మూవీ పట్టాలెక్కబోతుంది.

అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్… ఓకే చెప్పిన అల్లు అర్జున్?