ఐకాన్ సినిమా కోసం నానిని ట్రై చేస్తున్న దిల్ రాజు

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు గత ఏడాదిలోనే ఐకాన్ సినిమాని ఎనౌన్స్ చేశారు.

దానిని సెట్స్ పైకి తీసుకెళ్తారని అందరూ భావించారు.అయితే అనూహ్యంగా వకీల్ సాబ్ సినిమా లైన్ లోకి వచ్చింది.

ఐకాన్ ని పక్కన పెట్టి వకీల్ సాబ్ సినిమాని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రారంభించాడు.

ఈ సినిమా తాజాగా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత నటించిన సినిమా కావడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

అందుకు తగ్గట్లుగానే సినిమాకి మొదటి వారం కలెక్షన్స్ కూడా వచ్చాయి.చాలా సునాయాసంగా మొదటి వారంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసింది.

అయితే కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి వెళ్ళడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు.

దీంతో కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి.అయితే ఎలాగూ ఒటీటీ, శాటిలైట్ రూపంలో వకీల్ సాబ్ ని దిల్ రాజు ప్రేక్షకుల ముందుకి మరోసారి తీసుకొస్తారు.

ఇదిలా ఉంటే వకీల్ సాబ్ సక్సెస్ మీట్ లో ఐకాన్ సినిమా గురించి దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

ఐకాన్ అద్బుతమైన స్టొరీ అని దానిని ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తీసుకొని వెళ్తామని చెప్పుకొచ్చారు.

అయితే అది అల్లు అర్జున్ తో ఉంటుందనే విషయం మాత్రం చెప్పలేదు.ఈ నేపధ్యంలో ఇప్పుడు ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించే అవకాశం లేదనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉండటంతో పాటు ఐకాన్ స్టొరీ విషయంలో క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ని బన్నీ చేయడం లేదనే మాట బలంగా వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలో దిల్ రాజు, వేణు శ్రీరామ్ ఈ సినిమా కోసం నేచురల్ స్టార్ నానిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.

నానికి ప్రస్తుతం కొద్దో గొప్పో స్టార్ స్టేటస్ ఉంది.అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

ఈ నేపధ్యంలో ఐకాన్ సినిమా నానితో చేసిన వర్క్ అవుట్ అవుతుందని దిల్ రాజు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

సుకుమార్ కావాలనే రామ్ చరణ్ కోసం అలాంటి కథను రెడీ చేశాడా..?