లవ్ టుడే… దిల్ రాజు గొప్ప అవకాశాన్ని ఎందుకు వదిలేశాడో!

తమిళం లో సూపర్ హిట్ అయినా లవ్ టు డే ని తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు దిల్ రాజు తీసుకున్నాడు.

పెద్దగా సినిమా లు లేని సమయం లో దిల్ రాజు లవ్ టుడే సినిమా ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

విడుదలకు ముందు ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమా గురించి కాస్త ఎక్కువగానే దిల్‌ రాజు చెప్పాడు.

వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా లు నిర్మిస్తున్న దిల్ రాజు చిన్న సినిమా ను డబ్బింగ్ చేసి విడుదల చేయడం ఏంటి అంటూ అంతా ఆసక్తిగా చూశారు.

లవ్ టు డే సినిమా ఖచ్చితం గా తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది అని దిల్ రాజు భావించాడు.

తమిళం లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న లవ్ టుడే ను ఇక్కడ ఇంకాస్త బెటర్ గా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తే బాగుండేది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

దిల్‌ రాజు ఆశించిన స్థాయిలో తెలుగు వర్షన్ లవ్ టుడే కి వసూలు రాలేదు.

దిల్ రాజు ఈ సినిమా ను డబ్బింగ్ చేసేందుకు ముందుకు అయితే వచ్చాడు కానీ ప్రమోషన్ కార్యక్రమాల విషయం లో ఆసక్తి చూపించలేదు.

ఈ సినిమా ను ఆయన గట్టిగా ప్రమోట్ చేసి ఉంటే కచ్చితం గా పెట్టిన పెట్టుబడికి రెండు మూడు రెట్ల లాభం దక్కి ఉండేది అని బాక్సాఫీస్ వర్గాల వారి మాట.

"""/"/ పెద్ద సినిమా ల పోటీ లేదు చిన్న సినిమా లు కూడా పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు.

అయినా లవ్ టు డే కి పెద్దగా కలెక్షన్స్ రాక పోవడానికి కారణం మంచి ప్రమోషన్ చేయలేదు.

లవ్ టు డే సినిమా తెలుగు లో కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకునేది.

మరి దిల్ రాజు టీం ఎందుకు ఆ అవకాశాన్ని వదిలేశారు అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణం లో తమిళనాడు సూపర్ స్టార్ విజయ్ హీరోగా వారసుడు సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

మరో వైపు రాంచరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో సినిమా కూడా రూపొందుతుంది.

పుష్ప 2 ఫస్ట్ సింగిల్ సక్సెస్ అవుతుందటరా..?