గేమ్ చేంజర్ సినిమా కోసం ఒక పెద్ద సాహసం చేస్తున్న దిల్ రాజు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్( Ram Charan).

మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన చేసిన సినిమాలు ఆయనను 'మెగా పవర్ స్టార్' గా నిలిపాయి.

ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో గాని లేదంటే వచ్చే సంవత్సరం స్టార్టింగ్ లో గాని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్టు గా తెలుస్తుంది.

"""/" / అయితే రీసెంట్ గా శంకర్( Director S Shankar) డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2( Indian 2) సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు.

కాబట్టి ఇప్పుడు గేమ్ సినిమా మీద ఆయన పూర్తి ఫోకస్ పెడుతున్నాడు.ఇక దాంతో దిల్ రాజు ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

మొదటి నుంచి కూడా ఈ సినిమాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని రీ షూట్ చేయాలనే ఉద్దేశ్యం లోనే దిల్ రాజు గాని, శంకర్ గాని ఆలోచిస్తున్నాడు.

దీనికి మళ్ళీ డబ్బులు ఎక్కువ అవుతాయని తెలిసిన కూడా దిల్ రాజు సాహసం చేస్తున్నాడనే చెప్పాలి.

ఇక మొత్తానికైతే గేమ్ చేంజర్ సినిమాతో శంకర్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తన ఫామ్ ని మళ్ళీ కంటిన్యూ చేస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

"""/" / ఇక రామ్ చరణ్ కి కూడా ఈ సినిమా హిట్టవ్వడమనేది చాలా కీలకం కాబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా తో అటు శంకర్, ఇటు రామ్ చరణ్ ఇద్దరు కూడా సక్సెస్ ను అందుకొని దిల్ రాజుకి కూడా ఈ సినిమాతో కలెక్షన్ల వర్షం కురుస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

మరి ఈ సినిమా నుంచి టీజర్ గాని, ట్రైలర్ గాని వస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం మీద ఒక క్లారిటీ అయితే రాదు.

రాజమౌళి మాదిరిగానే గోపీచంద్ మలినేని కూడా మరో పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడా..?