దిల్ రాజు దృష్టిలో పడ్డ విశ్వక్ సేన్.. నెక్స్ట్ బిగ్ ఛాన్స్..!
TeluguStop.com
పాగల్ అంటూ శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విశ్వక్ సేన్ ఈ సినిమా రిలీజ్ విషయంలో అతని చొరవ ఎక్కువ ఉందని తెలుస్తుంది.
సినిమా పూర్తి చేసి అలా దగ్గర పెట్టుకుంటే ఏం లాభం రిలీజ్ చేస్తే ఓ పని అవుతుందని వారం రోజుల్లో ప్రమోషన్స్ అన్నిటిని దగ్గర ఉండి చూసుకున్నాడు విశ్వక్ సేన్.
ఆల్రెడీ దర్శక నిర్మాతగా టచ్ ఉంది కాబట్టి సినిమాను ప్రమోట్ చేయడంలో ఆ ఎక్స్ పీరియన్స్ వాడేశాడు విశ్వక్ సేన్.
అలా వారంలో పాగల్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేశాడు.అంతేకాదు సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తుంది.
విశ్వక్ సేన్ వల్లే పాగల్ ఈ నెల 14న వస్తుందని దిల్ రాజు కూడా చెప్పారు.
తను డిసైడ్ అయ్యి ఏం కాదు రిలీజ్ చేసేద్దాం అనుకోవడం వల్ల రిలీజ్ చేస్తున్నామని అన్నారు దిల్ రాజు.
ఈ క్రమంలో విశ్వక్ సేన్ పనితనం, హార్డ్ వర్క్ దిల్ రాజు మనసు గెలిచేలా చేశాయి.
పాగల్ సినిమాకు దిల్ రాజు జస్ట్ సమర్పకుడిగా మాత్రమే ఉన్నారు.చూస్తుంటే నెక్స్ట్ సినిమా దిల్ రాజు బ్యానర్ లో చేసే అవకాశం ఉండేలా కనిపిస్తుంది.
పాగల్ హిట్ అయితే దిల్ రాజు విశ్వక్ సేన్ కు మంచి ఛాన్స్ ఇచ్చేలా ఉన్నాడు.
ఇక పాగల్ సినిమా విషయానికి వస్తే నరేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై చిత్రయూనిట్ ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉంది.
సినిమాలో నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరి హీరోయిన్స్ గా నటించారు.
4 మందారం పువ్వులతో ఇలా చేశారంటే నెల రోజుల్లో మీ జుట్టు అవుతుంది డబుల్..!