Dil Raju : జైపూర్ చేరుకున్న దిల్ రాజు ఫ్యామిలీ.. పెళ్లి పనులలో బిజీబిజీ?
TeluguStop.com
దిల్ రాజు ( Dil Raju ) ఇంట పెళ్లి బాజాలుమోగబోతున్న సంగతి మనకు తెలిసిందే.
దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి ( Ashish Reddy ) వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జైపూర్ లో జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.
వీరి వివాహం డెసిషన్ వెడ్డింగ్ కావడంతో ఇప్పటికే దిల్ రాజు కుటుంబ సభ్యులందరూ కూడా జైపూర్ (Jaipur )చేరుకున్నారు.
ప్రస్తుతం వీరు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి మనకు తెలిసిందే.
"""/"/
రౌడీ బాయ్స్( Rowdy Boys ) అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఆశిష్ రెడ్డి ఫిబ్రవరి 14వ తేదీ విజయవాడకు చెందిన అద్వైత రెడ్డి ( Advitha Reddy ) అనే అమ్మాయితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
గత ఏడాది వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే.
ఇక వీరి వివాహం జైపూర్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది.ఇక ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు.
""img Src=""/
స్వయంగా దిల్ రాజు టాలీవుడ్, అలాగే రాజకీయ పెద్దలను కలిసి వివాహ ఆహ్వాన పత్రికలను అందజేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పటికే దిల్ రాజు కుటుంబ సభ్యులు జైపూర్( Jaipur ) చేరుకోగా పెళ్లి పనులలో బిజీ అయ్యారు.
నేడు హల్దీ మెహందీ ఫంక్షన్స్ జరగగా 14వ తేదీ వీరి వివాహపు ముహూర్తం నిర్ణయించారు.
జైపూర్ లో వివాహం చేసుకున్న అనంతరం దిల్ రాజు హైదరాబాదులో కూడా వీరి వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఈ సింపుల్ రెమెడీతో చెప్పండి హెయిర్ బ్రేకేజ్ కు బై బై..!