దిల్ రాజు వారసుడి సందడి ఎంత వరకు వర్కౌట్ అయ్యేను?
TeluguStop.com
స్టార్ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుండి హీరోగా ఆశిష్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
నిర్మాత దిల్ రాజు నిర్మాణ భాగస్వామి అయిన లక్ష్మణ్ తనయుడు ఈ ఆశిష్.
రౌడీ బాయ్స్ అనే టైటిల్ తో హీరోగా ఈయన ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.దిల్ రాజు తన బ్రాండ్ ఇమేజ్ తో రౌడీ బాయ్స్ ను తెగ ప్రమోట్ చేస్తున్నాడు.
హీరోగా అశిష్ కు ఈ సినిమా మొదటి సక్సెస్ ను ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెరుగుతూ ఉన్నాయి.
ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగేలా దేవిశ్రీ ప్రసాద్ అందించిన టైటిల్ సాంగ్ ను ఇటీవలే విడుదల చేయడం జరిగింది.
"""/"/
పాట విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అవ్వడం తో ఖచ్చితంగా సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.
దిల్ రాజు కథల ఎపిక విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటారు.కనుక ఆశిష్ కోసం కథను ఎంపిక చేసిన సమయంలో కూడా ఖచ్చితంగా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు.
హర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా ను థియేటర్ల ద్వారా మాత్రమే విడుదల చేస్తారని దిల్ రాజు కంపౌండ్ వారు అంటున్నారు.
దిల్ రాజు ఇప్పటి వరకు చాలా మంది హీరోలను పరిచయం చేసి సక్సెస్ దక్కించుకున్నాడు.
మరి తన ఇంటి వారసుడికి సక్సెస్ ఇచ్చేనా చూడాలి.
‘డాకు మహారాజు’ లో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..? ఒక బాలయ్య చనిపోతాడా..?